చిన్నారి ఇందు మృతిపై ఎన్నో అనుమానాలు..?
హైదరాబాద్ దమ్మాయిగూడ బాలిక ఇందు మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోస్టుమార్టం అనంతరం నిన్న ఇందు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. అర్ధరాత్రి మళ్లీ వారింటికి పోలీసులు వెళ్లి వాళ్ల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా గురువారం కనిపించకుండా పోయిన చిన్నారి.. శుక్రవారం చెరువులో శవమై తేలింది. దమ్మాయిగూడ చెరువులో పాప మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. డెడ్ బాడీని వెలికి తీసి పోస్ట్ మార్టం కోసం తరలించారు. పాప డెడ్ బాడీని తమకు చూపించకుండానే తరలించడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా స్థానికులు కూడా దమ్మాయిగూడ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. చిన్నారిపై అఘాయిత్యం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాప కనిపించడం లేదంటూ గురువారమే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. చిన్నారి ఇందు కుటుంబసభ్యుల ఆందోళనకు దిగారు. ఇందు మృతదేహంతో తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించారు. పాప మృతిపై స్పష్టత ఇవ్వాలని బాధితుల డిమాండ్ చేశారు. పాప ఎందుకు మృతి చెందిందో కారణాలు తెలిపే.. పోస్టుమార్టం నివేదిక తమకు ఇవ్వాలని పట్టుబట్టారు. పోస్టుమార్టం నివేదిక ఇవ్వకుండా పాప డెడ్ బాడీ.. అప్పగించడం పట్ల కుటుంబసభ్యుల అభ్యంతరం తెలిపారు. పాప మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
