కల్తీ మద్యం కాటుకు 65 మంది బలి.. బీహార్ లో ఆగని మరణాలు
బిహార్ లో కల్తీ మద్యం మరణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ కల్తీ మద్యం తాకి 65 మంది మృతి చెందారు. ఛప్రా జిల్లాలో పెరుగుతున్న మరణాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు కల్తీ మద్యం మరణాలపై దర్యాప్తు ముమ్మరమైంది. అదనపు ఎస్పీ సారథ్యంలో ముగ్గురు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్లు సహా 31 మందితో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సారణ్ జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. కల్తీ మద్యం తయారీకి సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే భయపడకుండా చెప్పాలని ప్రజలను కోరారు. మరోవైపు కల్తీ మద్యం సేవించి ఎవరైనా చనిపోతే పరిహారం ఇవ్వబోమని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. తాగవద్దని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు తాగితే మీరు చనిపోతారు. నిషేధానికి వ్యతిరేకంగా మాట్లాడే వారు ప్రజలకు ఎటువంటి మేలు చేయరు” అని బీహార్ సీఎం అసెంబ్లీలో పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 2016 నుండి బీహార్ లో మద్యపాన నిషేధం అమలులో ఉంది.
