హిమపాతంలో చిక్కుకున్న 400 వాహనాలు

రక్షించిన పోలీసు బృందాలు

సిమ్లా :

హిమపాతం కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌ రోహ్‌తంగ్‌పాస్‌లోని అటల్‌ టన్నెల్‌ దక్షిణ ప్రాంతం సమీపంలో 400 వాహనాల్లో చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించినట్లు అధికారులు తెలిపారు. గురువారం మానాలి-లేహ్‌ రహదారి, దాని పరిసర ప్రాంతాల్లో భారీగా మంచు కురవడం వల్ల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసు బృందాలు చేపట్టిన సహాయ కార్యక్రమాలకు 10-12 గంటలు పట్టింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ముగిసింది. వాహనాలు వాటి గమ్యస్థానాలకు వెళ్లినట్లు అధికారులు చెప్పారు. చిక్కుకుపోయిన పర్యాటకులు, స్థానికులకు ఆహారం అందించినట్లు వెల్లడించారు. మరోవైపు హిమపాతాన్ని ఆస్వాదించినట్లు పర్యాటకులు పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు కులు, మనాలికి తరలివస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *