తెలంగాణలో 14 కొత్త ఫిపోలా మాంసం, సీఫుడ్ లను ఔట్ లెట్ల ఏర్పాటు : ఫౌండర్ సీఈఓ సుశీల్ కనుగోలు
హైదరాబాద్
మాంసం ప్రియుల కోసం మరొ కొత్త మీట్ మార్ట్ అందుబాటులోకి వచ్చింది. దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద బ్రాండ్ అయినటు వంటి చెన్నై బేస్డ్ సంస్థ ఫిపోలా రిటైల్ ఇండియా తెలంగాణలోను తమ సేవలను విస్తరిస్తున్నట్లు తెలిపింది.
ఫిపోలా రిటైల్ ఇండియా 2016 నుంచి మాంసం ,సీఫుడ్ ను ఫిఫోలా బ్రాండ్ పేరుతో విక్రయిస్తోంది. పరిశుభ్రమైన వాతావరణంలో ప్రీమియం మాంసం ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తోంది .
2021 నాటికి దక్షిణ భారత దేశంలో 64 స్టోర్లు, 2022 నాటికి ఇండియా మొత్తం రెండు వందల స్టోర్లుకు విస్తరించాలని లక్ష్యంతో ముందుకు వెళ్తోందని సీఓఓ డాక్టర్ సంజోయ్ కుమార్ దాస్ తెలిపారు . రైతుల నుంచి నేరుగా వినియోగదారులకు అతితక్కువ ధరలకు, నాణ్యమైన ,తాజా మాంసపు ఉత్పత్తులను అందిస్తున్నామని తెలిపారు .తెలంగాణలో 14 కొత్త ఔట్ లెట్లను ఏర్పాటు చేశామన్నారు .
ఫిపోలా రిటైల్ స్టోర్లు బంజారాహిల్స్, మాదాపూర్ ,చందానగర్,హిమాయత్ నగర్ ,కూకట్ పల్లి, కొండాపూర్ , ప్రగతి నగర్ , బేగంపేట్,మణికొండ, దిల్ సుఖ్ నగర్ , అత్తాపూర్,కోకాపేట్ , గచ్చిబౌలి,శంషాబాద్ లలో ఉన్నాయని తెలిపారు .
ఇక 2021 నాటికి బెంగుళూరులో 19 కొత్త అవుట్‌లెట్‌లను ప్రారంభించి, తమ పరిధిని పెంచుకోవాలని కూడా ప్లాన్ చేస్తున్నామన్నారు .”ఈ సంవత్సరం మేము చెన్నై, కోయంబత్తూర్, హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 36 రిటైల్ దుకాణాలను ఏర్పాటు చేశామన్నారు దక్షిణ భారతదేశంలో మరిన్ని ఔట్ లెట్లువిస్తరించేందుకు ప్రణాళికలు రచించామని ఫౌండర్ ,సీఈఓ సుశీల్ కనుగోలు తెలిపారు . ఫిపోలా చేపలు, పౌల్ట్రీ, గొర్రె, మేక మాంసం అందిస్తుందన్నారు .దేశ విదేశాలకు చెందిన సీఫుడ్‌లను అందుబాటులో ఉంచామన్నారు .హైదరాబాద్ అంతటా మా రిటైల్ అవుట్‌లెట్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు , ఫిపోలా మొబైల్ యాప్ (ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్), వెబ్‌సైట్: www.fipola.in, కాల్ సెంటర్ +7667276672 ఫోన్ చేసి ఫిపోలా మాంసం ఉత్పత్తులు పొందవచ్చని సుశీల్ తెలిపారు .దీంతో పాటు స్విగ్గీ ,డోన్జో వంటి మర్చంట్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి ఆర్డర్ చేయడం ఇంటి వద్దకే డెలివరీ పొందవచ్చని సుశీల్ తెలిపారు.
డాక్టర్ సంజోయ్ కుమార్ దాస్, COO మాట్లాడుతూ “మేము ఇప్పటికే ఆగస్టులో హిమాయత్ నగర్, చందా నగర్, కూకట్‌పల్లి, కొండాపూర్, బేగంపేట్, మణికొండ, దిల్కుష్ నగర్, అత్తాపూర్ ,శంషాబాద్‌లో అవుట్‌లెట్‌లను ప్రారంభించాము. సెప్టెంబరులో మేము బంజారాహిల్స్, మాదాపూర్, ప్రగతినగర్, గచ్చిబౌలి మరియు కోకాపేటలలోని 14 స్టోర్లను ప్రారంభించామన్నారు ..
ఫిపోలా గ్రిల్ హౌస్ తమిళనాడులో 8 అవుట్‌లెట్‌లు ,హైదరాబాద్‌లోని దాదాపు అన్ని స్టోర్లలో ఫిపోలా గ్రిల్ హౌస్ లను ఏర్పాటు చేశామన్నారు . చెన్నైలో వాహనాలపై మూడు స్టోర్‌లతో ఫిపోలా ఆన్ వీల్స్ ప్రారంభించామని… త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభిస్తామని సంజోయ్ తెలిపారు .
ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 160 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు . దక్షిణ భారతదేశంలో మొత్తం 65 స్టోర్‌లకు చేరుకుంటుందన్నారు.
ఫిపోలా స్టోర్లలో మాంసం రిటైల్‌లో ఐదు వందలకు పైగా మాంసం ఉత్పత్తులు ఒకే చోట లభిస్తాయని …రసాయన ,పురుగుమందులు లేని ఉత్పత్తులు అందుబాటులో ఉంచామన్నారు .ప్రతి వారం అనేక ఆఫర్లు , లాయల్టీ ప్రోగ్రామ్‌తో సరసమైన ధరలకు మాంసపు ఉత్పత్తులు అందిస్తామన్నారు .