శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు ఎత్తివేత ..సాగర్ కి నీటి విడుదల

కర్నూలు

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో ఇన్ ఫ్లో పెరిగిపోతుంది. దీంతో శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండలా మారింది.
శ్రీశైలం డ్యాం నిండి పోవడంతో అధికారులు గేట్లు ఎత్తి సాగర్ కి నీటిని విడుదల చేశారు..డ్యాం లోకి కృష్ణ,తుంగభద్ర నదుల నుంచి భారీగా వరద వస్తుండటంతో డ్యాం గరిష్ట నీటి మట్టానికి చేరుకుంది. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి రెడ్డి,దేవస్థానం ఈవో రామారావు,నీటి పారుదల శాఖ అధికారులు పూజలు నిర్వహించి రెండు గేట్లను ఎత్తారు..డ్యాం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగులకి నీటి మట్టం చేరింది.గరిష్ట నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199.7354 టీఎంసీలు గా నిల్వ ఉంది.కృష్ణ తుంగభద్ర ల నుంచి ఇన్ ఫ్లోస్ 4,62,537 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.రెండు గేట్ల ధ్వారా 53,488 క్యూసెక్కులు, కుడి గట్టు పవర్ హౌస్ నుంచి 31,356 క్యూసెక్కులు,ఎడమ గట్టు పవర్ హౌస్ నుంచి 35,315 క్యూసెక్కులు,పోతిరెడ్డిపాడు ,మల్యలా ఇతర సాగునీటి కాలువలకు కలిపి మొత్తం 1,35,785 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో కొనసాగుతోంది. కృష్ణా నదికి ఇన్ఫ్లో పెరిగిపోవడంతో మరో ఎనిమిది గేట్లను అధికారులు ఎత్తివేశారు . శ్రీశైలం డ్యాం మొత్తం 10 గేట్లు ఎత్తివేయడంతో నీరు సాగర్ కు పరుగులు పెడుతుంది .

కనువిందు చేస్తున్న కృష్ణమ్మ పరవళ్ళు

శ్రీశైలం డ్యామ్ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉంటే ఆ అందాలు చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదు.

డ్యాం నుంచి నీళ్లు పరుగులు పెడుతుంటే ఆ అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *