హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాదులో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీఎం కేర్ ఫండ్స్ తో వ్యాక్సిన్ టెస్టింగ్ కేంద్రాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. వ్యాక్సిన్ సమర్దతను ఇక ఇక్కడే నిర్ధారించనున్నారు.
హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
పీఎం కేర్స్ ఫండ్స్ తో హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడాన్ని స్వాగతించారు.ఇప్పటి వరకు
దేశ వ్యాప్తంగా రెండే టెస్టింగ్ కేంద్రాలు ఉన్నాయి.
వ్యాక్సిన్ ఉత్పత్తిలో వేగాన్ని పెంచేందుకు మరో రెండు టెస్టింగ్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.
అందులో భాగంగా ఒకటి హైదరాబాద్ లో, మరొకటి పూనేలో ఏర్పాటు చేయనున్న కేంద్రం ప్రకటించింది.
హైదరాబాద్ లో టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుతో ఇక్కడి ఫార్మా కంపెనీలకు ఉపయోగకరంగా ఉంటుందంటున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.