హైదరాబాద్ హెచ్ఐసీసీలో జులై 5 హై లైఫ్ ఎగ్జిబిషన్..

హైదరాబాద్

అందమైన ముద్దుగుమ్మలు వయ్యారి హంసనడకలతో ర్యాంప్ పై చేసిన క్యాట్ వాక్ కనువిందు చేసింది. హైదరాబాద్ నోవాటెల్ లో జులై ఐదు నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న హై లైఫ్ ఎగ్జిబిషన్ బ్రోచర్ ను మోడల్స్ ఆవిష్కరించారు . భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా రూపొందించిన వస్త్ర ఉత్పత్తులు ,నగలు ధరించి మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో కలర్ ఫుల్ గా సాగింది. శం లోని ప్రముఖ డిజైనర్స్ తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించనున్నారు . కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కరోనా నిబంధనలు పాటిస్తూ ఎగ్జిబిషన్ ను కొనసాగిస్తామని నిర్వహకులు తెలిపారు . పెళ్ళి , శుభకార్యాలకు కావాల్సిన అన్ని రకాల వస్త్ర ఉత్పత్తులు ఈ ఎగ్జిబిషన్ లో కొలువుదీరనున్నాయి. ఈ ఎగ్జిబిషన్ జులై ఐదో తేదీ నుంచి ఏడో తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో మిస్ ఇండియా టీజీపీసీ టాలెంటెడ్ 2019 ,టాప్ ఫ్యాషన్ మోడల్ కర్ణిక, హనీ చౌదరి , కుసమ్ తదితరులు ఈ కర్టన్ రైజర్ ఈవెంట్ లో పాల్గొన్నారు .దేశంలోనే అతిపెద్ద ఫ్యాషన్ వేర్ కలెక్షన్స్ ను అందిస్తున్న హైలైఫ్ ఎగ్జిబిషన్ ను హైదరాబాద్ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్ డొమినిక్ తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌లో ఎక్స్‌క్లూజివ్ ఫ్యాషన్స్, స్టైలిష్ ఫ్యాషన్, డిజైనర్ స్పెషల్స్ , వెడ్డింగ్ స్పెషల్ , డెకర్ ,లగ్జరీ విత్ ఫ్యాషన్ జువెలరీ , అక్సిసిరీస్ లు అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *