హైదరాబాద్ లో రెండవ అవుట్‌లెట్ ప్రారంభించిన మ్యాజిక్ క్లీన్
హైదరాబాద్
కరోనా కేసులు సంఖ్య తక్కువ కావడం….లాక్‌డౌన్ ఎత్తి వేయడంతో ఎగ్జబిషన్లు, కొత్త షోరూంలు ప్రారంభించేందుకు ఉత్సహం చూపుతున్నారు. దీంతో నగరంలో ప్రారంభోత్సవాలు ఊపందుకుంటున్నాయి. ఈ కోవలోనే భాగ్యనగరవాసులకు లాండ్రీ సేవలందిస్తున్న మ్యాజిక్ క్లీన్ మరో అవుట్‌లెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.హైదరాబాద్ మణికొండ అల్కాపూర్ టౌన్ షిప్ లో ఏర్పాటు చేసిన ఈ అవుట్‌లెట్‌ను సుర్బాహి 70 ఎమ్‌ఎమ్ సినీ బృందం ఉషాంజలి, అనిల్ ప్రారంభించారు. అభిమాన నటి, నటులను చేసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో ఆ ప్రాంతంలో పండుగ వాతవరణం కనిపించింది. ఒక సామాజిక సేవ సంస్థ ద్వారా సేవలందించిన తాము….సామాజిక బాధ్యతగా అతి తక్కువ ఖర్చుతో మ్యాజిక్ క్లీన్ సేవలను ప్రజలకు అందిస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ యూసుఫ్‌ఖాన్ తెలిపారు. త్వరలోనే తమ సంస్థను ఆన్‌లైన్ లాండ్రీని ఫ్రాంచైజ్ చైన్‌కు తీసుకెళ్లానున్నట్లు చెప్పారు. తద్వారా ఎంతో మందికి స్వయం ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. త్వరలోనే బంజారా హిల్స్, గోల్కొండలలో రెండు కలెక్షన్ సెంటర్లు ఏర్పటు చేస్తున్నామన్నారు. ఈద్, దీపావళి , క్రిస్మస్ సందర్భంగా ‘మ్యాజిక్ ఆఫ్ గివింగ్’ ప్రచారాన్ని నిర్వహించి, పాత దుస్తులు సేకరించి అవసరమైన వారికి పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు…