హైదరాబాద్ తాజ్ కృష్ణ లో ట్రెండ్జ్ ఫ్యాషన్ డిజైనరీ ఎగ్జిబిషన్ ప్రారంభం
మగువల మనసును దోచే వస్త్రాలు, అభరణాలతో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శన ఫ్యాషన్ ప్రియులను మదిని దోస్తోంది. హైదరాబాద్ బంజాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ
హోటల్‌లో ట్రెండ్జ్ ఫ్యాషన్ డిజైనరీ ఎగ్జిబిషన్ ను ప్రముఖ పారిశ్రామిక వేత్త శైలజారెడ్డి ప్రారంభించారు . రాబోయే ఫెస్టివల్స్‌ను
దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు శాంతి తెలిపారు. కరోనా కారణంగా అన్నీ రంగాల్లో ఉన్నావారు తీవ్ర ఇబ్బందులు పడ్డారని శైలజారెడ్డి అన్నారు. లాక్‌డౌన్ తరువాత నగరంలోని ఎగ్జిబిషన్‌లు అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎగ్జిబిషన్ వలన అన్నీ రకాలైన ఉత్పత్తులు ఒకే వేదికపై లభిస్తాయన్నారు. డిజైన్ శారీస్, యాక్సిసరీస్, అభరణాలను ఈ ప్రదర్శన ద్వారా వస్త్రాభిమానులకు అందిస్తున్నట్లు నిర్వహకురాలు శాంతి తెలిపారు. భాగ్యనగర ఫ్యాషన్ ప్రియులకు కావల్సిన విధంగా ఉన్న ఉత్పత్తుల ప్రదర్శన మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటుందన్నారు.
హైదరాబాద్ నగరంలో మహిళలను ఆకట్టుకునేలా ప్రత్యేక వస్త్ర ప్రదర్శనతో పాటు నచ్చిన వాటిని కొనుక్కునే అవకాశాన్ని ట్రెండ్జ్ ఎగ్జిబిషన్ కల్పిస్తోంది.
ట్రెండ్జ్ ఎక్స్‌పోలో డిజైనర్ లెహెంగాస్, డిజైనర్ కుర్తాస్, డిజైనర్ ప్యూర్ బెనారస్ సిల్క్స్, సాంప్రదాయ చీరలు చేనేత చీరలు, యాక్సెసరీస్ మరియు డిజైనర్ సూట్స్ టచ్ ప్రదర్శనలో కొలువుదీరాయి. ముంబై, కోల్‌కతా, జైపూర్, నాగపూర్ వంటి అన్ని నగరాల నుంచి 100 మందికి పైగా మాస్టర్ డిజైనర్లు మరియు 1,20,000 సాంప్రదాయ, సమకాలీన డిజైన్లను ఎంచుకోవడానికి, ట్రెండ్జ్ ఎగ్జిబిషన్ మంచి ఫ్లాట్ ఫాంగా మారిందని శైలజారెడ్డి అన్నారు .ఆధునిక అభిరుచులకు అనుగుణంగా, ఆకర్షణీయంగా వస్త్ర ప్రదర్శన ఉందన్నారు. ఈ ప్రదర్శనలో నిర్వాహకురాలు శాంతి కతివరన్ తో పాటు దేశం నలుమూలల నుంచి డిజైనర్లు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన జులై 11వరకు జరగనుందని నిర్వాహకులు తెలిపారు.