హైదరాబాద్ ఖాజాగూడలో శంతను క్లీనిక్స్ అండ్ డయాగ్నస్టిక్స్ ను ప్రారంభించిన శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ,మై హోమ్స్ అధినేత జూపల్లి రాజేశ్వర్ రావు

అభినవ్ రావ్ ,ఎండీ శాంతను క్లీనిక్స్ అండ్ డయాగ్నస్టిక్స్

హైదరాబాద్ ఖాజాగూడలో అధునాతన సౌకర్యాలతో ఖాజాగూడలో శంతను క్లీనిక్స్ అండ్ డయాగ్నిస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి

హైదరాబాద్

హైదరాబాద్ ఖాజాగూడాలో డాక్టర్ అభినవ్ రావు తంగెడ అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన శంతను క్లీనిక్స్ అండ్ డయాగ్నిస్టిక్ సెంటర్ ను శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ప్రారంభించారు .

ప్రతీరోజు వ్యాయామం , సమతుల ఆహారం తీసుకుంటే మన శరీరాన్ని , మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చునని చిన్నజీయర్‌స్వామి అన్నారు. అందరి ఆరోగ్యం కోరి లాభాపేక్ష లేకుండా డాక్టర్ అభినవ్‌రావు చక్కటి క్లినిక్ ఏర్పాటు చేయటం అభినందనీయమని ప్రశంసించారు. మంచి సేవ చేయాలనే ఉద్దేశ్యం తో శంతను ఆసుపత్రి ని ఏర్పాటు చేసిన అభినవ్ రావ్ అభినందిస్తున్నానని చిన్న జీయ్యర్ స్వామి అన్నారు. శంతను అంటే మృత్యువును జయించడం అని ,ఇంత మంచి పేరు పెట్టడం శుభసూచికమన్నారు.రోగాన్ని దూరం చేసి ఆరోగ్యంతో కి తిరిగి వెళ్ళేలా ఈ ఆసుపత్రి సేవలు ఉండాలన్నారు.మంచి కోరిక మంచి లక్ష్యం మంచి సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి మరింత పురోభివృద్ధి సాధించాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశీర్వదించారు .రోగంతో ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు వైద్యులు మనోధైర్యం అందించాలన్నారు .అప్పుడే వారు పూర్తిగా రోగం నుంచి కోలుకుంటారని ఆయన అన్నారు.

మై హోం గ్రూప్స్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ శ్రీ త్రిడండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా శంతను
మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.సూపర్ స్పెషాలిటీ వైద్యంను సామాన్యులకు అందించడం కోసం ఈ క్లీనిక్ ప్రారంభిచడం అభినందనీయమన్నారు.
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన ఈ తరుణంలో ప్రతిఒక్కరు ఆగోగ్యాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలని మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్‌రావు అన్నారు. శంతను క్లినిక్‌లో నామమాత్రపు ధరలకు అన్ని రకాల సేవలు అందిస్తామని డాక్టర్ అభినవ్ రావు చెప్పారని రామేశ్వర్‌రావు అన్నారు.
కరోనానే కాకుండా ఇతర వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు ముందుజాగ్రత్తగా వైద్యపరీక్షలు చేసుకునేందుకు “శంతను” ఉపకరిస్తుందన్నారు.

అహోబిల స్వామి మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడేవిధంగా హాస్పిటల్ ను ఏర్పాటుచేసిన అభినవ్ రావ్ ను ఆయన అభినందించారు.

అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 30 శాతం డిస్కౌంట్ తో అన్ని రకాల టెస్ట్ లు చేస్తామని “శంతను ” క్లినిక్ ఫౌండర్ డాక్టర్ అభినవ్‌రావు తంగెడ స్పష్టం చేశారు.
“శంతను” డయాగ్నిస్టిక్ క్లినిక్ డైరెక్టర్ శ్రీలక్ష్మి జూపల్లి , క్లినిక్ వైద్యులు , సిబ్బందిని త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశీర్వదించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *