హైదరాబాద్ కోఠి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో ఘనంగా 66 వ స్టేట్ బ్యాంక్ దినోత్సవ వేడుకలు

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచిందని ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఓం ప్రకాష్ మిశ్రా వెల్లడించారు. హైదరాబాద్ కోఠిలోని ఎస్ బీ ఐ ప్రధాన కార్యాలయంలో ,తెలంగాణలోని అన్ని బ్యాంకుల్లో   66 స్టేట్ బ్యాంక్ దినోత్సవ వేడుకలను నిర్వహించారు .వినియోగదారులకు సాంకేతిక పరిజ్ఞానంను ,  మెరుగైన సేవలు అందించడం వల్లే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే  టాప్ 25 ర్యాంకు చేరుకుందన్నారు. దేశంలోనే ప్రధాన బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండయా కొనసాగడానికి ఉద్యోగులు, సిబ్బంది కృషి ఉందన్నారు. కస్టమర్లకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందించడం వల్ల వినియోగదారులు తమకు నచ్చిన ప్రదేశంలో లావాదేవీలు నిర్వహించడానికి వీలు కల్పించామన్నారు . ఎస్బీఐ  యోనో యాప్ ద్వారా మిలియన్ మంది డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుకుంటుదన్నారని ఆయన తెలిపారు . సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకుని ఆర్థిక సైబర్ మోసానికి గురైన బాధితుల కోసం పోర్టల్ ను ,హెల్ప్ లైన్ నెంబర్ ను తీసుకువచ్చామన్నారు .  www.cybercrime.gov.in, హెల్ప్ లైన్ నెంబర్ 155260 ద్వారా సమాచారం అందిస్తే వెంటనే బ్యాంక్ సైబర్ క్రైమ్ సెల్ వివరాలు పంపితే అకౌంట్  బ్లాక్ చేస్తామని డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఓం ప్రకాష్ మిశ్రా తెలిపారు .హైదరాబాద్ సర్కిల్ లో కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యకలాపాలను అమలు చేస్తున్నామని తెలిపారు.  66 వ స్టేట్ బ్యాంక్ దినోత్సవంను పురస్కరించుకుని  ఎస్బిఐ లోకల్ హెడ్ ఆఫీస్  వద్ద ఇంటర్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్  నిర్వహిస్తున్న  మంచు పాఠశాలకు  30 సీట్ల సామర్థ్యం ఉన్న  స్కూల్ బస్సును  విరాళంగా అందజేసినట్లు ఓం ప్రకాష్ మిశ్రా తెలిపారు .  కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో భాగంగా గాంధీ ,ఉస్మానియా ఆసుపత్రులకు చెరో మూడు చొప్పున  ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *