హైదరాబాద్ కోకాపేటలో అత్యాధునిక ఫెర్టిలిటీ కేంద్రాన్ని ప్రారంభించిన కామినేని ఫెర్టిలిటీ

హైదరాబాద్ :
జంటనగరాలలో ప్రముఖ మరియు సమగ్ర సంతాన సాఫల్య కేంద్రమైన కామినేని ఫెర్టిలిటీ, నగరంలోని కోకాపేట ప్రాంతంలో తన రెండవ అత్యాధునిక కామినేని ఫెర్టిలిటీ సెంటర్‌ను ప్రారంభించింది. కామినేని ఫెర్టిలిటీ, డైరెక్టర్ డాక్టర్ గాయత్రి , కామినేని ఫెర్టిలిటీ, వైస్ ప్రెసిడెంట్, డాక్టర్ అస్మాఖాన్ ,ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్‌లో స్పెషలిస్టులైన డాక్టర్ నిహారిక మరియు డాక్టర్ ప్రణితలు పాల్గొన్నారు.. కామినేని ఫెర్టిలిటీ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు దాదాపు 3000లకు పైగా జంటలు సంతానాన్ని పొందడంలో సహాయపడి వారి జీవితాలలో సంపూర్ణమైన ఆనందాన్ని తెచ్చామని డాక్టర్ గాయిత్రి తెలిపారు.
3500 అడుగుల సువిశాలమైన విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ నూతన కేంద్రంలోని అంతర్జాతీయ యూరోపియన్ ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోకుండా అత్యంత ఆధునిక సాంకేతికతను కలిగిన ఎఆర్‌టి ఎంబ్రియాలజీ ల్యాబోరేటరీ పూర్తిగా ఇంటిగ్రేటెడ్ చేయబడిందన్నారు. తెలంగాణలోనే మొట్టమొదటిదైన ఎల్126 ఎమ్‌పి వర్క్‌స్టేషన్, హైరిజల్యూషన్ స్టేరియో మైక్రోస్కోప్, సిఒడిఎ టవర్, ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్, అండ్రోలజీ ల్యాబ్, పిజిడి ల్యాబ్ మరియు సమగ్ర సంతాన సమస్య సంరక్షణను సులభతరం చేయడానికి అధునాతన ప్రీజింగ్ మౌలిక సదుపాయాలు ఒకే చోట అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.
నగరంలో పురుషులలో వంధ్యత్వం పెరిగిపోవడం సర్వసాధారణంగా మారిపోవడాన్ని కామినేని ఫెర్టిలిటీ గుర్తించింది. పురుషులలో సంతాన సాఫల్యరేటును పెంచడంలో ప్రత్యేక నిపుణుల బృందం గత 10 సంవత్సరాలుగా ఇంటెలిజెంట్ ఫెర్టిలిటీ పద్దతులతో పాటు అంకితభావంతో కూడిన సంరక్షణను అందిస్తున్నదన్నారు.
నానాటికీ సంతానలేమి సంఘటనలు పెరుగుతూ మరీ ముఖ్యంగా తెలంగాణలో తీవ్ర ఆందోళన కలిగించే ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించవలసి ఉన్నారు. మారుతున్న జీవనశైలి. మానసిక ఒత్తిడి, పని ఒత్తిళ్లు పెరిగిపోతున్న కాలుష్యం మరియు ఇతర సమస్యల కారణంగా అనేక జంటలు జీవితంలో తల్లిదండ్రులయ్యే మధురానందానికి దూరం అవుతున్నారని, ప్రస్తుత సవాళ్ల సమయంలో సంతానలేమి సమస్య సంరక్షణలో గొప్ప సాంకేతిక పురోగతి ఒక ఆశాకిరణంగా ఉన్నదన్నారు. కామినేని ఫెర్టిలిటీ సాంకేతికత మరియు చికిత్సలలో నూతన పరిణామాలను వేగంగా అమలు చేస్తూ, ఇక్కడ అవసరమైన వారికి వాటిని అందుబాటులోకి తీసుకువచ్చిందని డాక్టర్ గాయత్రి అన్నారు.
కామినేని ఫెర్టిలిటీ ప్రతి జంట యొక్క ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వారికి వ్యక్తిగతీకరించిన సంరక్షణను అందించడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని డాక్టర్ గాయిత్రి అన్నారు. అంతర్జాతీయ ప్రోటోకాల్‌ను అనుసరించడంతోపాటు ప్రపంచంలోని ఉత్తమమైన వాటితో సమానంగా అత్యుత్తమ ఫలితాలను అందిస్తుంది. నగరంలోని కోకాపేట ప్రాంతంలో ఏర్పాటైన ఈ నూతన ఫెర్టిలిటీ కేంద్రం సంతానలేమి సమస్యతో అధికంగా బాధపడుతున్న యువత సమస్యను తీర్చగలదని డాక్టర్ గాయత్రి తెలిపారు