హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్ నియమాకం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్ నియమితులయ్యారు
లోధా కమిటీ సిఫార్సుల మేరకు అపెక్స్ కౌన్సిల్ ఈమేరకు తీర్మానం చేసింది. అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, అజారుద్దీన్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇవి చినికి చినికి గాలివానలా మారి మరింత వివాదాస్పదంగా మారాయి. ఉద్దేశపూర్వకంగా హెచ్‌సిఎ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ అజారుద్దీన్‌ను ప్రెసిడెంట్ పదవి నుంచి అపెక్స్ కౌన్సిల్ తప్పించింది. హెచ్‌సిఎ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. ఈ నెల 15 న షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ షోకాజ్ నోటీసులకు ఇప్పటికీ అజారుద్దీన్ వివరణ ఇవ్వలేదు.
ఈ క్రమంలో తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్‌ను నియమిస్తూ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది