స్వాతంత్ర్య భారత చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం : బీజేపీ జిల్లా అధ్యక్షులు సామా రంగారెడ్డి
భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం అని బీజేపీ జిల్లా అధ్యక్షులు సామా రంగారెడ్డి అన్నారు.ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ఆధ్వర్యంలో రాజేందర్ నగర్ నైజర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమర్జెన్సీ గ్రహణం స్వాతంత్ర్య భారత చరిత్రలో చీకటి అధ్యాయం. ప్రజాస్వామ్య పునాదులను కదిలించడానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతగా వ్యవహరించిన తీరు అత్యంత దౌర్భాగ్యమన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ, పౌర హక్కులను కాలరాస్తు 21 నెలల పాటు సాగిన నియంతృత్వ నిరంకుశ ప్రభుత్వ నిర్బంధాలను ఎదిరించి ప్రజాస్వామ్య పరిరక్షణకై పాటుపడిన వీరులందరికి జోహార్లు తెలియజేశారు.
దేశవ్యాప్త చీకటి దినం
ప్రజాస్వామ్య అపహరణ దినమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు.1975 జూన్ 25 తో ఆరంభమై 21 నెలలపాటు దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి అరాచకాలు తదనంతరం దశాబ్దాల తరబడి గా రాజకీయ చైతన్యానికి ప్రోత్సాహకంగా కొత్త తరాన్ని యువతరాన్ని ప్రేరేపించాయి అని అన్నారు. అలనాటి భారతీయ జన సంఘ ఎమర్జెన్సీ అనంతరం భారతీయ జనతా పార్టీ ఎదిగిందని గుర్తుచేశారు. నూతన ఉత్సాహాన్ని సమకూర్చుకొని క్రమక్రమంగా దేశవ్యాప్తంగా ప్రజానీకం మనల్ని ఆదరించేందుకు ప్రజా తీర్పు రూపంలో ఆశీర్వాదాన్ని సాధించేందుకు
ప్రజా ఉద్యమాల నిర్మాణానికి ఎమర్జెన్సీ చీకటి పాలన గురించి ప్రతి ఏటా ప్రజల సమక్షంలో వివరించి కొత్త తరాన్ని యువతరాన్ని చైతన్యపరిచి ప్రజాస్వామిక విలువలను కాపాడేందుకు ఉత్ప్రేరకంగా స్వీకరిస్తూ నిర్మాణ క్రమాన్ని కొనసాగిస్తోంది అని అన్నారు.
అలాగేతెలంగాణ రాష్ట్రంలో కూడా అప్పటి ఎమర్జెన్సీ ని గుర్తు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ధర్నా చౌక్ లను ఎత్తివేసి యువత పక్షన ఏ నిరసన కార్యక్రమాలు ఉన్న ముందస్తు అరెస్టులు చేస్తూ మరో ఎమర్జెన్సీ ని తలపించే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం చేసే చర్యలకి బీజేపీ అడుగడుగునా ఎదుర్కొంటు రాబోయే రోజుల్లో ఈ ఎమర్జెన్సీ ని విముక్తి కలిగే విధంగా బంగారు తెలంగాణ బాటలు వేసే విధంగా బీజేపీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు,కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.