సినీనటుడు కత్తి మహేష్ కు ప్రమాదం.
నెల్లూరు..
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదరిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . విజయవాడ నుంచి పీలేరు కు వెళ్తున్న ఇన్నోవా కారు ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది.కారులో ప్రయాణిస్తున్న సినీ నటుడు కత్తి మహేష్ తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బెలూన్స్ తెలుసుకోవడంతో కత్తి మహేష్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు .
ప్రమాదం సంభవించిన వెంటనే కత్తి మహేష్ ను
నెల్లూరు మెడికేర్ హాస్పటల్ కు తరలించారు. నెల్లూరులో ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ కళ్ళు, దవడకి తీవ్ర గాయాలు అయ్యాయి..