సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సు పెంచాలంటూ సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి
సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రతినిధులు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యే ఎంపీలు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో కలిసి విజ్జప్తి చేశారు. సింగరేణి కార్మికుల పదవి విరమణ వయస్సును పెంచేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని సీఎం కేసీఆర్ తెలిపారు. సింగరేణి కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, పెద్దపెల్లి ఎంపీ వెంకటేశ్ , కార్మిక నాయకులు వెంకట్రావు, రాజిరెడ్డి, కింగర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు..