సంతానలేమి సమస్యలపై దంపతులు అపోహలు తొలగించుకుని అవగాహన పెంచుకోవాలి డాక్టర్ సువర్చల

సంతానలేమి సమస్యలపై దంపతులు అపోహలు తొలగించుకుని అవగాహన పెంచుకోవాలి డాక్టర్ సువర్చల
పిల్లలు పుట్టకపోవడానికి మహిళలతో పాటూ పురుషులు కూడా సమానంగా భాద్యులు

పలు జంటలలకు పిల్లలు కలుగకపోవడానికి మహిళలలో లోపమే కారణమనే అపోహలు ఎక్కవగా ఉన్నాయి. అయితే అది పూర్తిగా తప్పని జీవా ఫెర్టిలిటీ కేంద్రం సైంటిఫిక్ డైరెక్టర్ డా. సువర్చల వర్థన్ అన్నారు. పిల్లలు కలుగకపోవడానికి పెళ్లైన జంటలలో మహిళలు 40 శాతం కారణమైతే పురుషులు కూడా అంతే 40 శాతం కారణమవుతున్నాయని ఇటీవల అందుబాటులోనికి వస్తున్న పలు పరిశోధనలు తేలిందన్నారు.

పదేళ్ల క్రితం వరకూ పురుషులకు సంబంధించిన అంశాలపై భారత్ లో సరైన అవగాహన ఉండేది కాదని కానీ ప్రస్థుతం పరిస్థితిలో మార్పు వచ్చిందని ఆమె అన్నారు. అలానే పురుషులలో వీర్య కణాలలో లోపం ఉంటే గతంలో వీర్యాన్ని దానం గా స్వీకరించాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. అయితే ఇప్పుడు అందుబాటులోనికి వచ్చిన ఆధునిక వైద్య పరిజ్ఞానంతో వృషణాల నుంచి నేరుగా వీర్యకణాలను సేకరించవచ్చని అలానే పలు మందులతో వీర్య కణాల శక్తిని పెంపొందించడానికి కూడా వీలవుతుందని వివరించారు.

ఇక TESA/MESE/TESE వంటి సేవలు, అందులోనూ ముఖ్యంగా azoospermia రుగ్మతతో భాదపడే వారిలో సంతానోత్పత్తి శాతాన్ని పెంచడానికి దోహదపడుతాయని డా. సువర్చల వివరించారు. వీటితో పాటూ high DNA fragmentation ఉన్న పరుషులకు అవసరమైన మైక్రో ఫ్లూయిడ్స్, Magnetic Activated Cell Sorting (MACS) సేవలు కూడా జీవా ఫెర్టిలిటీ లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

అయితే పెళ్లైన జంటలలో పిల్లలు పుట్టకపోతే ముందుగా మహిళలకు చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారని అయితే చిట్ట చివరకు అది మహిళలలో లోపం కాదు, పురుషులలో లోపమని తేలే సరికి వయస్సు దాటి పోయి సమస్యలకు దారి తీస్తోందని డా. సువర్చల వివరించారు. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా పిల్లలు కలుగకుండా ఇబ్బంది పడుతున్న సందర్భంలో జంటలోని ఇరువురూ ఒకే సారి పరీక్షలు చేయించుకుంటే వారిరువురిలో ఎవరిలో ఎక్కువ లోపం ఉందో గుర్తించి వెంటనే చికిత్స అందించగలిగితే వెంటనే సంతానం కలిగే అవకాశాలుంటాయని సూచించారు.

ఇక ఇటీవల కాలంలో కోవిడ్ మహమ్మారి కారణంగా ఏర్పడిన పలు ప్రత్యేక పరిస్థితులతో తలెత్తిన తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడి కూడా సంతానోత్పత్తికి సంబంధించిన అంశాలపై ప్రభావం చూపుతోందని ఆమె అన్నారు. వీటితో పాటూ ఊబకాయం, దూమపానం, త్రాగుడు వంటి పలు అంశాలు కూడా పురుషులలో సంతానోత్పత్తి లేమికి కారణమవుతున్నాయని, వీటిపై కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డా. సువర్చల సూచించారు.

అయితే ఇలాంటి అంశాలలో పురుషులలో ఇంకా అవగాహన పెరగాల్సి ఉందని, ఈ దిశగానే ఫాదర్స్ డే ను పురస్కరించుకొని పురుషులలో తలెత్తే ఈ ఆరోగ్య అంశంపై జీవా ఫెర్టిలిటీ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ఉచిత క్యాంపులను నిర్వహిస్తోందిని డా. సువర్చల వెల్లడించారు. ఫాదర్స్ డే నుండి నెల రోజుల పాటూ నిర్వహించే ఈ క్యాంపులలో ఉచిత కౌన్సిలింగ్ తో పాటూ పలు పరీక్షలను తగ్గింపు ధరలతో చేయనున్నామని ఆమె తెలిపారు. ఈ సదుపాయాన్ని విరివిగా వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *