వైద్య పరికరాలను స్టెరిలైజ్ చేసే పరికరాన్ని ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ

క్యాన్సర్ చికిత్స కు వచ్చే రోగులకు వైద్యాన్ని అందించే సమయంలోనూ, శస్త్ర చికిత్స నిర్వహించాల్సినపుడు, పలు వ్యాధి నిర్థారణ పరీక్షల్లో వినియోగించే వైద్య పరికరాలను శుభ్రం చేయాల్సిన అవసరం ఉంటుంది. వైద్య పరికరాలను పూర్తి స్థాయిలో పరిశుభ్రం చేయడానికి అవసరానికి తగినట్లు అత్యధిక ఉష్టోగ్రతల వద్ద లేదా తక్కువ ఉఫ్ణోగ్రతల వద్ద శుభ్రం (స్టెరిలైజ్) చేస్తారు. . మెటల్ అధారిత పరికములను అత్యధిక ఉష్టోగ్రత వద్ద, ప్లాస్టిక్, రబ్బర్ లాంటి పదార్థములతో తయారైన పరికరములు అత్యల్ప ఉష్టోగ్రత వద్ద శుభ్రం (స్టెరిలైజ్) చేస్తారు. ఇలాంటి అవసరములకు అనుగుణంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో ఆధునిక స్టెరిలైజ్ యంత్రాలను అందుబాటులోకి తీసకువచ్చారు. అత్యల్ప ఉష్టోగ్రతల వద్ద నాన్ మెటాలిక్ పదార్థములతో తయారైన పరికములను శుభ్రం చేస్తారు. ఆసుపత్రిలో శుభ్రం చేసే పరికరం యొక్క కాలపరమితి తీరడంతో ఇందుకోసం అమెరికా నుండి అత్యాధునిక ప్లాస్మా స్టెరిలైజేషన్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ASP Sterad 100 NX with All Clear Technology తో కూడిన యంత్రాన్ని తీసుకువచ్చారు. కోటి రూపాయలకు పైగా విలువ కలిగిన ఈ యంత్రం తో గతంలో ఉన్న పాత యంత్రం తీసుకొనే సమయం కన్నా సగం సమయం అంటే 24 నిమిషములలోనే శుభ్రం చేయగలగడమే కాకుండా 99.9 శాతం వరకూ సూక్ష్మాతి సూక్ష్మ అవాంఛిత కణాలను కూడా పూర్తిగా తొలగిస్తుంది. తద్వారా ఒక రోగికి వినియోగించన తర్వాత మరో రోగికి వినియోగించే సందర్భాలలో ఎలాంటి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా నూటికి నూరు శాతం నిరోధిస్తుంది.

కరోనా మహమ్మారి కాలంలో ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ యంత్రాన్ని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించి వినియోగంలోనికి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా శ్రీ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ రోగులకు అత్యంత సురక్షిత, భద్రతతో కూడిన ఆధునిక చికిత్స అందించాలనే సంస్థ లక్ష్యానికి అనుగుణంగానే ఈ అత్యాధునిక స్టెరిలైజేషన్ యంత్రాన్ని అమెరికా నుండి దిగుమతి చేసుకొని రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్ట మొదటి సారిగా హాస్పిటల్ లో ఏర్పాటు చేశామని వివరించారు. ప్రస్థుత కరోనా కాలంలో నూటికి నూరు శాతం ఇన్ఫెక్షన్లను నిరోధించే ఈ యంత్రం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. అంతే గాకుండా ఈ యంత్రం కారణంగా పునర్వినియోగం చేయాల్సిన వైద్య పరికములు, సాధనములు అతి తక్కువ సమయంలోనే అందుబాటులోనికి వస్తాయని తద్వారా ఎక్కువ మంది రోగులకు వీటిని ఆలస్యం లేకుండా వినియోగించే వీలుంటుందని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణతో ట్రస్ట్ బోర్డు సభ్యులు జెయస్ ఆర్ ప్రసాద్, భరత్,సీఈఓ డాక్టర్ ఆర్ వి ప్రభాకర రావు,సీఓఓ రవికుమార్, మెడికల్ డైరెక్టర్ టియస్ రావు,మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫణి కోటేశ్వర రావు, అసోసియేట్ డైరెక్టర్ అకడమిక్ అండ్ యాడ్ లైఫ్ డాక్టర్ కల్పనా రఘునాథ్, ఛీఫ్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ బసంత్ కుమార్, బయోమెడికల్ విభాగాధిపతి రామాంజనేయ గౌడ్ లతో పాటూ బయోమెడికల్ ఇంజనీర్లు వెంకటేష్, రమ్య వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *