విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి జులై 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూలై 15 అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం అవుతున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. . విమాన సర్వీసులు ప్రారంభం నేపథ్యంలో విమానశ్రయం లో జిల్లా కలెక్టర్ జె. నివాస్ , జాయింట్ కలెక్టర్ మాధవిలత , గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ , విమానశ్రయ ఉన్నతాధికారులు , నూజివీడు ఆర్డీవో రాజ్యలక్ష్మి రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతకముందు నూతనంగా నిర్మించిన రన్ వే పరిశీలించారు. తాజాగా 3360 మీటర్ల కొత్త రన్ వే పనులు విస్తరణ పూర్తి చేశామని ,గతంలో 2286 మీటర్ల రన్ వే ఉండగా అదనంగా 1074 మీటర్ల విస్తరించామని చెప్పారు. ఇప్పటివరకు కేటగిరీ -సి రాకపోకలు సాగించాయని, రన్ వే అందుబాటులో రావటంతో పెద్ద బోయింగ్ విమానాలు 777, 747 , ఎయిర్ బస్ – 30 సర్వీసులు రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. దుబాయ్ , సింగపూర్ సర్వీసులు ప్రారంభం అవుతాయని తెలిపారు.దీంతో విజయవాడ అంతర్జాతీయ విమానశ్రయం ఒక మైలు రాయిని సాధించిందని విమానశ్రయ డైరెక్టర్ మధుసూధనరావు చెప్పారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ రెగ్యులర్ విమాన సర్వీసులు వందే భారత్ మిషన్ కింద ఆక్టోబర్ 15 వరకు మస్కట్ నుంచి సర్వీసులు నడుస్తాయని చెప్పారు. సమావేశం అనంతరం రన్ వే విస్తరణ అర్ అండ్ అర్ నిర్వాసితులతో కలెక్టర్ ,జేసి ఎమ్మెల్యే మాట్లాడారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కేటాయించిన స్ధలంలో నిర్వాసితులకు లాటరీ పద్దతిలో ప్లాట్స్ కేటాయిస్తామని కలెక్టర్ నివాస్ హామీ ఇచ్చారు. నిర్వాసితులకు కావాల్సిన మౌళిక సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *