వింగ్స్ మోడల్స్ హబ్ ఆధ్వర్యంలో మిస్ అండ్ మిస్టర్ ఇండియా పోటీలు నిర్వహిస్తాం: మనోజ్ వీరగోని

హైదరాబాద్ ,బేగంపేట్

అందం, అబినయంతో పాటు టాలెంట్ ఉన్న యువతీయువకులకు వింగ్స్ మోడలింగ్ హబ్ సంస్థ ఆహ్వానం పలుకుతుందని సంస్థ నిర్వహకులు మనోజ్ తెలిపారు. హైదరబాద్ బేగంపేట్ కంట్రీక్లబ్ లో వింగ్స్ మోడలింగ్ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్టర్ అండ్ మిస్ సౌత్ ఇండియా 2021 అందాల పోటీలు కలర్ ఫుల్ గా సాగాయి. ఈ అందాల పోటీలలో విజేతలతో మీడియా మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మిస్టర్ సౌత్ ఇండియా 2021 విజేత తరుణ్ మాట్లాడుతూ తనకు మోడలింగ్ రంగం అంటే ఎంతో ఇష్టమని అందుకే తాను ఎక్కడ మోడలింగ్ పోటీలు జరిగినా పాల్గొంటానని చెప్పారు. గతంలో నిర్వహించిన వింగ్స్ మోడలింగ్ హబ్ లో పాల్గొన్నానని ..ఈ ఏడాది జరిగిన పోటీల్లో మిస్టర్ సౌత్ ఇండియా 2021 టైటిల్ దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు .ఫ్యాషన్ ,మోడలింగ్ రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకుని మరింత మెరుగైన టైటిల్ దక్కించుకునేందుకు పోటీ పడతానని చెబుతున్నారు .

మిస్ సౌత్ ఇండియా 2021 విజేత పూజ మాట్లాడుతూ చెన్నై నుంచి వచ్చిన తనకు మిస్ సౌత్ ఇండియా 2021 టైటిల్ దక్కడం సంతోషంగా ఉందన్నారు .వింగ్స్ మోలింగ్ హబ్ డైరెక్టర్ మనోజ్ ప్రొత్సాహంతో పాటు తల్లిదండ్రులు ,స్నేహితుల సపోర్ట్ తో నే మిస్ సౌత్ ఇండియా 2021 విజేతగా నిలిచానని చెప్పుకొచ్చారు.

వింగ్స్ మోడలింగ్ హబ్ సంస్థ డైరెక్టర్ మనోజ్ మాట్లాడుతూ …కరోనా కారణంగా వర్చువల్ విధానం ద్వారా 200 మంది అడిషన్స్ లో పాల్గొన్నారని తెలిపారు. వీరిలో 50 మందిని ఎంపిక చేసి హైదరాబాద్ కంట్రీ క్లబ్ లో గ్రాండ్ ఫినాలే నిర్వహించామన్నారు .ఇదే ఉత్సాహంతో ఈ ఏడాదిలో వింగ్స్ మోడలింగ్ హబ్ ఆధ్వర్యంలో మిస్ ఇండియా పోటీలు నిర్వహిస్తామని మనోజ్ తెలిపారు.

మిస్టర్ అండ్ మిస్ సౌత్ ఇండియా 2021 విజేతలతో నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *