రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ముత్యాల సాగర్ కుటుంబానికి 25 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించిన తెలంగాణటిడిపి

తెలంగాణ వస్తే ఉద్యోగాలు ఇస్తామని హమీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టి ఆర్ ఎస్‌ ప్రభుత్వం ఆచరణలో పూర్తిగా విఫలం చెందిందని మహబూబాబాద్ టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు కొండపల్లి రామచందర్ రావు అన్నారు. మహబూబాబాద్‍ జిల్లా ,బయ్యారం మండల కేంద్రంలో ఇటీవల ఉద్యోగాల నోటిఫికేషన్ లు రాటంలేదని ఖమ్మం లో రైలు క్రింద పడిఆత్మహత్య చేసుకున్న ముత్యాల సాగర్‌ కుటుంబాన్ని టిడిపి ప్రతినిధి బృందం తో కలిసి పరామర్శించారు. తెలంగాణ టిడిపి రాష్ట్రఅద్యక్షడు బక్కిని నర్సింహలు ఆదేశాల మేరకు భాధిత కుటుంబ సభ్యులకు 25000/- రుపాయలు ఆర్ధిక సాయం అందజేశారు.
ఈ సందర్బంగా రామచందర్ రావు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి AP కి ముఖ్యమంత్రి (1995-2014) గా ఉన్నప్పుడు 8 డియస్సీలు ద్వారా 1లక్షా 60 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారని గుర్తు చేశారు. యువతకు CMEY పథకం క్రింద 70 వేల గ్రూపుల ద్వారా 6.50 లక్షల మందికి ఉపాధి కల్పించారని తెలిపారు.టి ఆర్ ఎస్‌ ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న సాగర్‌ కుటుంబాన్ని ఆదుకోని 50లక్షల ఎక్స్ గ్రేసీయాతో పాటు ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆజ్మీరా రాజునాయక్‌ టిడిపి రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ సాధనలో ఎక్కువ మంది దళితులు ఆమరులైన ఈ రోజు ఒక్క కుటుంబమే రాష్ట్రాన్ని ఏలుతుందని తెలిపారు.
రాష్ట్ర పార్టీ నుండి సాగర్‌ కుటుంబాన్ని ఆదుకుంటామని అన్నారు.
టిడిపి మహబూబాబాద్‍ ఇంచార్జ్ సునీత మంగీలాల్‌ మాట్లాడుతూ ఉద్యోగం రాక ఎంతో మంది యువకులు ఆత్మహత్య లు చేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనంలేదని తెలిపారు .సాగర్‌ కుటుంబాన్ని మంత్రులు గాని,MLAలు గాని పరామర్శించక పోవటం సిగ్గు చేటని తెలిపారు.
టీడీపీ ప్రతినిధి బృందంలో టిడిపి రాష్ట్రకార్యదర్శి Md.ఇమామ్ ,టిడిపి మహబూబాబాద్‍ పార్లమెంట్‌ ఉపాద్యక్షులు ముద్రగడ వంశీ
తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *