ఆరోగ్య సమస్యలకు యోగా పరిష్కారం చూపిస్తుంది :బండి సంజయ్
ఆరోగ్య సమస్యలకు యోగా పరిష్కారం చూపిస్తుంది :బండి సంజయ్
భారతీయ ప్రాచీన వైద్యం యోగా అవసరాన్ని గుర్తించి ప్రధాని మోడీ ఐక్యరాజ్య సమితి లో ఒప్పించి ప్రపంచ వ్యాప్తంగా యోగాను పరిచయం చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ రాష్ట్ర బిజెపి కార్యాలయంలో యోగ డే సందర్భంగా బీజేపీ నేతలు యోగాసనాలు చేశారు. కరోనా నుంచి మనకు మనం కాపాడేందుకు యోగా ఎంతగానో దోహదపడుతుందన్నారు.ప్రపంచం అంతా యోగా దినోత్సవం జరుపుకుంటుంటే సీఎం కేసీఆర్ కు యోగా చేయాలన్న ధ్యాస లేదన్నారు.
యోగా పై సందేశం ఇవ్వాలన్న సోయి లేదు కేసీఆర్ కులేదని… స్పూర్తి దాయక మైన మాటలు కూడా చెప్పడం లేదన్నారు.