మొయినాబాద్ లో CNG స్టేషన్ ను ప్రారంభించిన మోఘా

మొయినాబాద్

ఇంజనీరింగ్ ,నిర్మాణ రంగం దిగ్గజ సంస్థ మేఘా ..మరొకొత్త రంగంలోకి అడుగు పెట్టింది. గృహ,వాహన అవసరాలు తీర్చేందుకు మేఘా సీఎన్జీ ఫ్లాంట్ ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పర్యావరణానికి మేలు చేకూర్చేలా మేఘా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

సహజ వాయువు సరఫరా కోసం మేఘా గ్యాస్ అనే బ్రాండ్ ను ఇట్స్ స్మార్ట్ ఇట్స్ గో ను ప్రారంభించింది. త్వరలోనే ఈ మేఘా గ్యాస్ ను ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో సైతం సీఎన్జీ గ్యాస్ ఫ్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రచించింది .

డీజీల్ ,పెట్రో ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్న క్రమంలో వాహన వినియోగదారులకు ఇంధన ఖర్చు తడిసి మోపెడు అవుతుంది .ఈ తరుణంలో మేఘా సంస్థ అతి చౌక ధరలకే ఇంధన సేవలు అందించేందుకు GHMC పరిధి లో తన రెండవ CNG స్టేషన్ ను మొయినాబాద్ లో లాంఛనంగా ప్రారంభించింది మేఘా సంస్థ.

తెలంగాణా కు ఆర్థికంగా తలమానికమైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మేఘా గ్యాస్ పేరిట CGD ప్రాజెక్ట్ లో భాగంగా నూతన CNG స్టేషన్ ప్రారంభించింది. వినియోగదారులకు అతి చౌక ధరలకే CNG ఇంధనాన్ని అందించేందుకు మేఘా గ్యాస్ ముందుకు వచ్చింది.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ వద్ద మేఘా సంస్ధ నూతన CNG స్టేషన్ ని ప్రారంభించింది. వాహన వినియోగదారులకు అతి చౌక ధరలకే ఇంధనంను అందిస్తోంది. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తన వంతు ప్రయత్నం ప్రారంభించింది మేఘా ఇంజనీరింగ్ సంస్ధ.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్, మొయినాబాద్ తో పాటు జిల్లా వ్యాప్తంగా మరొ 12 CNG స్టేషన్ లు త్వరలో ప్రారంభించనున్నట్లు మేఘా యాజమాన్యం తెలిపింది . అంతే కాకుండ CGS మదర్ స్టేషన్ నూ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది .

తెలంగాణలో నే తొలిసారిగా నల్గొండ జిల్లాలో ఇంటింటికీ గ్యాస్ సరఫరా సేవలను మేఘా సంస్థ ప్రారంభించింది . దీనితో పాటు వరంగల్, ఖమ్మం జిల్లాల్లో తన సేవలను విస్తరించాలని నిర్ణయించింది .

రంగారెడ్డి జిల్లాలో వాయు కాలుష్యము ని తగ్గించేందుకు మేఘా గ్యాస్ దోహద పడుతుందని మేఘా సంస్థ CGD, రంగారెడ్డి ప్రాజెక్ట్ మేనేజర్ S S పవన్ కుమార్ తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని చోట్లా “మేఘా గ్యాస్” సేవలను విస్తరిస్తూ.. ఇటు వినియోగదారులకు , అటు పర్యావరణానికి మేలు చేయుటకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

CNG మొయినాబాద్ స్టేషన్ ప్రారంభవత్సంవలో S S పవన్ కుమార్ తో పాటు, HPCL సేల్స్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, పెట్రోల్ బంక్ డీలర్లు ఉమేశ్ , దీపక్ సింగ్ , మేఘా సిబ్బంది , పలువురు ప్రమఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *