మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మరోసారి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్
మెడికల్ హాస్పిటల్ మరోసారి మెగా వ్యాక్సిన్ డ్రైవర్ కు సిద్ధమైంది . మొదటి విడతలో ఒకే రోజు 50 వేల మందికి వ్యాక్సినేషన్ వేసి రికార్డు సృష్టించిన మెడికల్ హాస్పిటల్ మరోసారి హైదరాబాద్లో రెండు ప్రాంతాల్లో వ్యాక్సిన్ డ్రైవర్ చేపట్టింది ఈనెల 27వ తేదీన ఆదివారం మెడికవర్ హాస్పిటల్స్ మెగా వాక్సినేషన్ డ్రైవ్ ని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో , బాలానగర్ బొజాయ్ ఫంక్షన్ హాల్ లో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నారు.
కోవిడ్ -19 నియంత్రణలో భాగంగా సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) తో కలిసి ప్రఖ్యాత పేరుగాంచిన మెడికవర్ హాస్పిటల్స్ ప్రతిష్టాత్మకంగా వాక్సినేషన్ డ్రైవ్ ను హైటెక్ సిటీలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో బాలానగర్ లోని బొజాయ్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం 27 వ తేదీ ఉదయం 7 .00 గంటల నుండి సాయంత్రం 7 .00 గంటల వరకు వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టనున్నారు . ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ కరోనా కారణంగా చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు. దాన్ని అరికట్టడం వాక్సినేషన్ తోనే సాధ్యం . కరోనా ను అరికట్టడంలో భాగంగా మెడికవర్ హాస్పిటల్స్ వాక్సినేషన్ డ్రైవ్ ని ఏర్పటు చేశామన్నారు. ఈ డ్రైవ్ లో Covisheild వాక్సిన్ ఇవ్వడం జరుగుతున్నదన్నారు. ఈ అవకాశం https://medicoveronline.com/mega-drive/ మరియు COWIN వెబ్సైటు లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. . ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా ఆయన కోరారు.మరిన్ని వివరములకు మా హెల్ప్ లైన్ నెంబర్ ని 040 68334455 సంప్రదించవచ్చన్నారు.