ములాయం సింగ్ యాదవ్ మృతికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం

ములాయం సింగ్ యాదవ్ మరణవార్త ఎంతో బాధ కలిగించిందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

ములాయం సింగ్ యాదవ్ తనకెంతో ఆప్తులని , సోదరుడిని ఈ రోజు కోల్పోయానని తెలిపారు. 4 దశాబ్దాలుగా హుందా రాజకీయాలతో నన్ను ఎప్పుడూ ఆకట్టుకున్న నేత ములాయం అని గుర్తు చేసుకున్నారు. ఆయనతో కలిసి గతంలో పనిచెయ్యడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తన ఆలోచనల ద్వారా లక్షలాది మంది జీవితాలను మార్చిన నేత ములాయం యాదవ్ అని అన్నారు. అఖిలేష్ యాదవ్ సహా కుటుంబ సభ్యులకు, ఉత్తరప్రదేశ్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *