మరో నిజాంను తలపిస్తున్న సీఎం కేసీఆర్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

గో వధను ప్రొత్సహిస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. గోరక్షణ సమితి,భజరంగ్ దళ్ , విశ్వహిందూ పరిషత్ పిలుపు మేరకు ఛలో ప్రగతి భవన్ ముట్టడిలో భాగంగా ముందస్తు అరెస్టులు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. హిందువుల ఆరాధ్యదైవం అయినటువంటి గోవులను అక్రమంగా తరలించి యధేచ్చగా వధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు .గోవధను చాటుమాటున ప్రోత్సాహిస్తున్న ఈ ప్రభుత్వం ఎటువంటీ చర్యలు తీసుకోవడంలేదన్నారు.తెలంగాణ అసెంబ్లీలో గోవధ చట్టాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ లో గోవధ జరుగుతున్నా పట్టించుకోకుండా చూసిచూడనట్టు వ్యవహరిస్తుందని ఆరోపించారు. సుప్రీంకోర్టు గోవులను వధించే కబేళాల కంపెనీలను మూసేసె విధంగా ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని పలుమార్లు హెచ్చరించిన కొన్ని రాష్ట్రాలు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.ప్రభుత్వం వెంటనే స్పందించి గోవధను ఆపేవిధంగా చట్టం తేవాలని లేని పక్షంలో హిందు సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ అక్రమ అరెస్టులలో బీజేపీ నాయకులు వర ప్రసాద్, రవి గౌడ్, రాజ్ జాస్వాల్,లక్ష్మణ్, నవీన్, నందు మరియు భజరంగ్ దళ్ నాయకులు బాలాజీ,శివ, గోవింద్, ఠాకూర్ తదితరులను మియపూర్, చందనగర్ పోలీస్ స్టేషన్ లకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *