భారతదేశంలో పనిచేసేందుకు అత్యుత్తమమైన వంద కంపెనీలో సింక్రోనీ ఇండియాకు ఐదవ ర్యాంక్

భారతదేశంలో పనిచేసేందుకు అత్యుత్తమమైన వంద కంపెనీలో సింక్రోనీ ఇండియాకు ఐదవ ర్యాంక్

హైదరాబాద్‌

ప్రీమియర్‌ కన్స్యూమర్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ, సింక్రోనీ ప్రారంభమై ఏడు సంవత్సరాలు పూర్తయింది. భారతదేశంలో పనిచేసేందుకు అత్యుత్తమమైన 100 కంపెనీలలో 2021 గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ సంస్థ జాబితాలో అత్యుత్తమ స్థానంలో నిలిచింది. భారతదేశంలో పనిచేసేందుకు అత్యుత్తమమైన 100 కంపెనీల జాబితాలో ఐదవర్యాంకును సాధించింది. 2020వ సంవత్సరంలో ఇది 27వ ర్యాంకును పొందగా… వరుసగా నాలుగు సంవత్సరాలుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సింక్రోనీ పొందుతుంది. ఉద్యోగుల
సంరక్షణ వాతావరణాన్ని సింక్రోనీ సృష్టించడంతో పాటుగా తమ ఉద్యోగులు, భాగస్వాములు, వినియోగదారులు, కమ్యూనిటీలకు మద్దతునందించేందుకు కట్టుబడి ఉంది. కరోనా నేపథ్యంలో తమ ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత, శ్రేయస్సుకు అమిత ప్రాధాన్యతనిస్తూనే వేగంగా తమ సిబ్బందికి ఇంటి వద్దనే పని చేసే అవకాశం కల్పించింది. ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయమైన ఆఫీస్‌ వాతావరణాన్ని ఉద్యోగుల ఇంటి వద్దనే ఏర్పాటుచేసేందుకు తగిన సహాయమందించింది. మాకు మా ఉద్యోగులు అతి పెద్ద ఆస్తి అని…వారి శ్రేయస్సు మరియు విజయానికి మద్దతునందించేందుకు మేము కట్టుబడి ఉన్నామని సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ లీడర్ సింక్రోనీ ఇండియా ఆండీ పొన్నేరీ తెలిపారు .ఈ సంక్షోభం సమయంలో తమ సంస్థకు దేశంలో పని చేస్తున్న అత్యుత్తమ వంద కంపెనీల్లో సింక్రోనీ సంస్థకు ఐదవ ర్యాంకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌ సింక్రోనీ క్యాంపస్ లో 120 మందికి పైగా దివ్యాంగులు పనిచేస్తున్నారని…42% మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని తెలిపారు . వైవిధ్యమైన ఆలోచనలు, వినూత్నమైన లక్ష్యాలు కలిగిన ఉద్యోగులతో సింక్రోనీ కంపెనీ మరింత మెరుగైన ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *