పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు తేజాలకు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ శుభాకాంక్షలు
పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు తేజాలకు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ శుభాకాంక్షలు
పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు తేజాలకు భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్ పురస్కారం అందుకోనున్నకృష్ణ ఎల్లా, శ్రీమతి సుచిత్ర ఎల్లా, నాదెళ్ల సత్యనారాయణ, పద్మశ్రీ కి ఎంపికైన గరికిపాటి నరసింహారావు, కీర్తిశేషులు గోసవీడు షేక్ హసన్, దర్శనం మొగిలయ్య, రామ చంద్రయ్య, డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు, శ్రీమతి పద్మజ రెడ్డిలకు న్యాయమూర్తి రమణ పేరు పేరునా అభినందనలు తెలిపారు. తెలుగుజాతి కీర్తి పతాకను కోవిడ్ టీకా ఆవిష్కరణతో విశ్వ వినువీథుల్లో ఎగురవేసిన ఎల్లా దంపతులు, అతిపెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీకి సారథ్యం వహిస్తున్న నాదెళ్ల సత్యనారాయణ పద్మభూషణ్ కు ఎంపికవడం ముదావహమన్నారు రమణ. చక్కని తెలుగు వాచకంతో, అర్థవంతమైన ప్రవచనాలతో తెలుగు సాహితీ లోకాన్ని సుసంపన్నం చేసిన గరికిపాటి నరసింహారావు గారు, విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన ఇతర పద్మశ్రీ అవార్డు గ్రహీతలు తెలుగు జాతికి గర్వకారణమని జస్టిస్ రమణ కొనియాడారు