పద్మ అవార్డు గ్రహీతలకు చంద్రబాబు శుభాకాంక్షలు
పద్మ అవార్డు గ్రహీతలకు చంద్రబాబు శుభాకాంక్షలు
అమరావతి
కేంద్రం పకటించిన పద్మ వార్డుల జాబితాలో 7 గురు తెలుగు వ్యక్తులు ఉండడంపై టిడిపి అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. పద్మ అవార్డు గ్రహీతలకు ఈ సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు 7 పద్మ అవార్డులు రావడం పై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి నలుగురికి, ఎపి నుంచి ముగ్గురికి పద్మ అవార్డులు రావడం తెలుగు ప్రజలకు దక్కిన గౌరవం అని చంద్రబాబు అన్నారు. భారత్ బయోటెక్ సిఎండి, జెఎండి కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాలకు సంయుక్తంగా పద్మ భూషన్ అవార్డు దక్కడం పై శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో భారత్ భయోటెక్ యాజమాన్యమైన కృష్ణ ఎల్లా – సుచిత్రా ఎల్లా చేసిన సేవలకు గుర్తింపుగానే పద్మ భూషన్ అవార్డు వచ్చిందని చంద్రబాబు అన్నారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు, వైద్యులు సుంకర వెంటక ఆదినారాయణ శుభాకాంక్షలు తెలిపారు. ఇక కళల విభాగంలో గోసవీడు షేక్ హాసన్ కు మరణానంతరం పద్మశ్రీ రావడం ఆయనకు వచ్చిన గుర్తింపుగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణ నుంచి అవార్డులు అందుకున్న దర్శనం మొగలయ్య, రామచంద్రయ్య, పద్మజా రెడ్డిలతో పాటు… ప్రముఖ నటి షావుకారు జానకి, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర పిచాయ్, సీరం సంస్థ చైర్మన్ సైరస్ పూనావాలా లకు కూడా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.