ప్రభుత్వం రేపు మమ్ముల్నిఏమైనా చేయవచ్చు బండి శ్రీనివాస రావు
ప్రభుత్వం రేపు మమ్ముల్నిఏమైనా చేయవచ్చు బండి శ్రీనివాస రావు
అమరావతి
ఉద్యోగసంఘం నేత బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మమ్మల్ని ఏమైనా చేయొచ్చునని, తమ ఇళ్లపై దాడి చేయొచ్చునని, మమ్మల్ని అరెస్ట్‌లు చేయొచ్చునని అన్నారు. అయినా సరే తాము భయపడేది లేదని, సమ్మె తమ జన్మహక్కుగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఏపీ ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లయిందని బండి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఒక్కటే సమస్యని, ఆర్టీసీ ఉద్యోగులకు అన్నీ సమస్యలేనని అన్నారు. ఈహెచ్‌ఎస్ కార్డులతో ఆర్టీసీ కార్మికులకు వైద్యం అందని పరిస్థితి నెలకొందన్నారు. తమకు కొత్తజీతాలు వద్దన్నా.. ప్రభుత్వం ఇస్తానంటోందని… ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేది రివర్స్ పీఆర్సీ అని అన్నారు. 14.29 శాతం ఫిట్మెంట్‌ను ఏ పీఆర్సీ ప్రకారం ఇస్తున్నారో చెప్పాలని బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.