ప్రపంచ మార్కెట్ లోకి సమంత బ్రాండ్ “సాకి”
హైదరాబాద్:
సినీ నటి సమంత అక్కినేని ఒన్ ఫ్యాషన్ బ్రాండ్ సాకి ప్రపంచంలోని అన్ని దేశాల్లో విస్తరించేందుకు ప్రణాళిక రచించింది. సాకి మాతృ సంస్థ మెర్చ్ లైఫ్‌స్టైల్ ఈ సెలబ్రిటీ బ్రాండ్‌ను తీసుకోవటానికి ఆసక్తి చూపుతోంది. సాకి బ్రాండ్ USA,మలేషియా ,సింగపూర్ తో పాటు అనేక అంతర్జాతీయ మార్కెట్ లోకి దూసుకెళ్తోంది. ఇటీవల కెనడా, యుఎఇ , ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో .సాకీ ఫ్యాషన్ బ్రాండ్ అందుబాటులో ఉంది . తూర్పు యూరోపియన్ దేశాలు, ఖతార్ ,న్యూజిలాండ్ లకు విస్తరించింది. జూన్ 26 వ తేదీ నుండి నటి సమంతా అక్కినేని గ్లోబల్‌కు వెళ్లడం గురించి తన ఆలోచనలను మీడియాతో పంచుకుంది .ఇప్పటి నుండి తాము USA, సింగపూర్ తో పాటు మరిన్ని దేశాలకు సాకి అంతర్జాతీయ షిప్పింగ్‌ను ప్రారంభించామన్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన భారతీయ అభిమానులఅభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని సమంత తెలిపారు .సాకీ బ్రాండ్ ప్రస్తుతం 15 దేశాలకు విస్తరించామన్నారు .
అంతర్జాతీయ విస్తరణపై వ్యవస్థాపకుడు మరియు సిఇఒ సుశ్రుతి కృష్ణతో చర్చించామని… “మా స్వదేశీ భారతీయ బ్రాండ్ సాకి ప్రపంచ వ్యాప్తంగా అందించేందుకు నిర్ణయం తీసుకుందని సమంత అక్కినేని తెలిపారు ఇండియన్ ఆరిజిన్ ఐకాన్ గా సాకీ బ్రాండ్ మారడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు .ప్రస్తుత ఫ్యాషన్ కు అనుగుణంగా క్రాఫ్టెడ్ చీరలు, నేచురల్ ఇండిగో కుర్తాస్,
ఆధునిక భారతీయ దుస్తులు. Saaki.co వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచామన్నారు .సాకి బ్రాండ్ నుంచి రోజువారీ దుస్తులు , ప్రీమియం దుస్తులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ లవర్స్ కు అందించడం ప్రారంభించడం గర్వించదగ్గవిషయమని చెప్పుకొచ్చారు. భారతీయ సంస్కఈతీ సాంప్రదాయాలు ప్రతిబింబించే కొత్త డిజైనరీ కలెక్షన్స్ ను సమంత అక్కినేని అవిష్కరించారు .
Saki jet speed