ప్రతి ఒక్కరూ పుట్టినరోజున మొక్కలు నాటాలి:శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని తన పుట్టినరోజును పురస్కరించుకుని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ఆవరణంలో శాట్స్ చైర్మెన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి మొక్కలు నాటరు.
సీఎం కేసీఆర్ కలలుగన్న హరిత తెలంగాణ సాధనలో భాగంగా తన వంతు ప్రయత్నంగా మొక్కలు నాటుతున్నట్లు షర్ట్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. వాతావరణ కాలుష్యం తగ్గాలని హరిత తెలంగాణ సహకారం కావాలనే ఉద్దేశ్యంతో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మా అందరిలో ఎంతో స్ఫూర్తిని నింపింది అన్నారు. రానున్న రోజుల్లో మా క్రీడా కారుల అందరి చేత మొక్కలు నాటించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ లో రాఘవ, కిషోర్ గౌడ్, సరూర్ నగర్ స్టేడియం అధికారి వెంకటేశ్వరరావు, జయశంకర్, శ్రీనివాస్, నవీన్ వర్మ, క్రీడాకారులు పాల్గొన్నారు.