పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాతనే పాఠశాలలు ప్రారంభించాలి : టిఎన్ఎస్ఎఫ్,తెలుగు యువత

కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై అధిక ప్రభావం చూపిస్తుందని నివేదికలు వస్తున్న నేపథ్యంలో పాఠశాలలు ,కళాశాలలు ప్రారంభించే విషయంపై పునరాలోచించుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని టిఎన్ఎస్ఎఫ్ ,తెలుగు యువత విద్యార్థి సంఘం నేతలు వినతిపత్రం సమర్పించారు జూలై 1 వ తేదీ నుండి రాష్ట్రంలో పాఠశాలలు ,కళాశాలలు ప్రారంభించడం వలన కలిగే నష్టాలను దృష్టిలో పెట్టుకుని … ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోగలరని కోరారు. చిన్నారులకు వ్యాక్సినేషన్ పూర్తిచేసిన తరువాతనే పాఠశాలలు ప్రారంభించాలని సబితా ఇంద్రా రెడ్డిని కోరారు.

ఈ కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త బూర్గుల రమాకాంత్ గౌడ్, తెలుగు యువత మల్కాజ్‌గిరి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి సాయి నాగార్జున, ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షులు హేమంత్ గౌడ్, టీఎస్‌ఎన్‌వి మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఉపాధ్యక్షులు దేవినేని శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

1 thought on “పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాతనే పాఠశాలలు ప్రారంభించాలి : టిఎన్ఎస్ఎఫ్,తెలుగు యువత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *