పట్టాలెక్కిన ఎంఎంటీఎస్ రైళ్లు
సుదీర్ఘ విరామం తర్వాత ఎంఎంటీఎస్ రైళ్ళు పట్టాలు ఎక్కాయి. గత ఏడాది కరోనా కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటిఎస్ నిలిపివేసింది. అతి తక్కువ ధరలో సిటీలో తిరిగే ఈ ఎంఎంటీఎస్ రైళ్ళు తిరిగి పుఃనప్రారంభం కావడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లు బోగీలను ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. దాదాపు 15 నెలల విరామం అనంతరం ఎంఎంటీఎస్ రైళ్ళు పునఃప్రారంభం కావడంతో నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఫలక్‌నుమా నుంచి లింగంపల్లికి 3 MMTS రైళ్లు, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు 3 ఎంఎంటీఎస్ రైళ్ళు ,హైదరాబాద్ నుంచి లింగంపల్లికి 2, లింగంపల్లి నుంచి హైదరాబాద్‌కు 2 ఎంఎంటీఎస్ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది . ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం పది ఎంఎంటీఎస్ రైళ్లు నడవనున్నారు. దశల వారీగా ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య పెంచనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది .