నల్గొండ జిల్లాలో రోడ్ల విస్తరణ కు 84 కోట్లు
జంక్షన్ల అభివృద్ధి కి నాలుగు కోట్లు
వేగవంతమైన నల్లగొండ సుందరీ కరణ
నల్లగొండ పట్టణాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణాభివృద్ధి కి నిధుల వర్షం కురిపించారు. చరిత్రలోనే ముందెన్నడూ లేని రీతిలో పట్టణంలో రోడ్ల విస్తరణ చేపట్టాలంటూ ఆయన ఆదేశించిన నెల రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.డిసెంబర్ చివరి వారంలో వరుసగా ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖామంత్రికే టి రామారావు లుజిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డిలతో కలసి పట్టణబివృద్ది పై ప్రత్యేక సమీక్షలు నిర్వహించిన విషయం విదితమే.ఇందులో భాగంగా పట్టణ సుంసరికరణలో బాగంగా అధికారులు ఆఘమేఘాల మీద నివేదికలు రూపొందించి అటు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇటు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో అందించడం జరిగింది.ఈ క్రమంలోనే పట్టణాభివృద్ధి లో మొదటి ప్రాధాన్యంరోడ్ల విస్తరణ గా భావించిన ప్రభుత్వం ఏకంగా ఒకేసారి 84 కోట్ల నిధులను విడుదల చేసింది.అంతే గాకుండా పట్టణంలోనీ ప్రధాన కూడళ్లలో అభివృద్ధి నిమిత్తం మరో నాలుగు కోట్లు విడుదల చేస్తూ జి ఓ లు విడుదల చేశారు. రోడ్ల విస్తరణ నిమిత్తం విడుదలైన 84 కోట్లలో హైదరాబాద్ రోడ్ లో ఉన్న వివేకానంద విగ్రహం మొదలుకొని క్లాక్ టవర్ పెద్దబండ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు 46 కోట్లు,డి యి ఓ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు 18 కోట్లు,దేవరకొండ రహదారిపై ఉన్న నీలగిరి-నందికొండ కూడలి నుండి కత్తాల్ గూడెం వరకు 15 కోట్లు,కలెక్టర్ కార్యాలయం నుండి కేశరాజు పల్లి వరకు 15 కోట్లతో రోడ్ల విస్తరణ చేపట్టనున్నట్లు స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. అంతే గాకుండా జంక్షన్ ల అభివృద్ధి కొరకు విడుదల చేసిన నాలుగు కోట్ల నిధులతో మర్రిగూడ బై పాస్ రోడ్,యన్ జి కళాశాల,సుభాష్ చంద్రబోస్ విగ్రహం జంక్షన్, డి యి ఓ కార్యాలయం కూడళ్లలో అభివృద్ధి చేపట్టనున్నట్లు ఆయన వెల్కడించారు.
కృతజ్ఞతలు
ఇదిలా ఉండగా స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆఘమేఘాల మీద నల్లగొండ పట్టణ సుందరీ కరణకు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పురపాలక శాఖామంత్రి కేటీఆర్ కు రాష్ట్ర విద్యుత్ జగదీష్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.