దేశ రక్షణ కోసం బార్డర్ లో జవాన్లు పోరాడుతున్నారు అదేవిధంగా దేశం లోపల కరోనా పై డాక్టర్ లు పోరాడుతున్నారు : సినీ నటుడు సుమన్

ప్రఖ్యాత వైద్యులు దివంగత డా. బిసి రాయ్ స్మృత్యర్థంగా నిర్వహించబడే జాతీయ వైద్యుల దినోత్సవం వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి .హైదరాబాద్ అమీర్ పేట్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ నిర్వహించిన డాక్టర్స్ డే వేడుకలకు ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ ముఖ్య అతిథిగా హాజరైనారు.

కరోనా మహమ్మారి కాలంలో ఎందరో వైద్యులు ఇంటికి, కుటుంభ సభ్యులకు దూరంగా ఉండి పని చేయడం జరిగందని అస్టర్ ప్రైమ్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సతీష్ రెడ్డి అన్నారు . కోవిడ్ పై పోరాటంలో ఆస్టర్ ప్రైమ్ వైద్యులు చేసిన కృషిని ఆయన అభినందించారు. త్వరలోనే కోవిడ్ మహమ్మారి పై విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు.

సరిహద్దులలో ఎలానైతే జవాన్లు దేశ రక్షణ కోసం సహసోపేతంగా పోరాడుతున్నారో అలానే కోవిడ్ మహమ్మారి కాలంలో దేశం లోపల వైద్యులు అంతే సాహసంగా పోరాడుతున్నారని సినీ నటుడు సుమన్ తల్వార్ పేర్కొన్నారు. సరిహద్దులలోని జవాను కూడా కొంత మేర బుల్లెట్ ఎక్కడ నుండి వస్తుందనే విషయంపై అవగాహన ఉంటుందని అయితే కోవిడ్ తో పోరాడుతున్న వైద్యులు మాత్రం సూక్ష్మ క్రిమి ఏవైపు నుండి వస్తుందో తెలియని స్థితిలో కూడా పని చేయడం అభినందనీయమన్నారు. వైద్యులు చేస్తున్న సేవలు అనిర్వచనీయమని … రోగంతో భాదపడుతూ ఆందోళన చెందిన మనస్సుతో వచ్చే రోగులకు వైద్యులు చెప్పే మంచి మాటలు నమ్మకాన్ని కలిపించడమే కాకుండా వ్యాధి నివారణకు ఎంతగానో దోహదపడుతాయన్నారు . వైద్యులు, వైద్య సంస్థలపై జరుగుతున్న దాడులు మంచి పని కాదని, వీటిని ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇలా వైద్యులు చేస్తున్న వీరోచిత పోరాటాల వలన త్వరలోనే దేశ ప్రజలు సాధారణ జీవనాన్ని జీవించగలుగుతారన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. కోవిడ్ పై పోరాటంలో వ్యాక్సినేషన్ అనేది కీలక పాత్ర పోషిస్తున్నందున అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సుమన్ విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ లో సేవలు అందిస్తున్న సీనియర్ వైద్యులు రఘు రాములు అమృత్ రావ్, అనిరుద్ కుమార్ పురోహిత్, లంకా సత్య రామ కృష్ణ, సుధాకర్, ముఖ్య అతిథి సుమన్ తల్వార్ సన్మానించారు.

సన్మాన కార్యక్రమానంతరం, ముఖ్య అతిథి సుమన్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ ప్రత్యేకంగా రూపొందించిన డా ఆస్టర్, యానిమేషన్ వీడియోలను విడుదల చేశారు. ఈ వీడియో సిరీస్ లోని మొదటి వీడియో ను ఈ సందర్భంగా ప్రదర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *