దసరా ధమాకా లక్కీడ్రాను ప్రారంభించిన తెలంగాణ జాన్డీర్ డీలర్స్ అసోసియేషన్

తెలంగాణ జాన్డీర్ డీలర్స్ అసోసియేషన్  కొత్త స్కీంను అందుబాటులోకి తీసుకువచ్చింది. నేటి నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు జాన్డీర్ ట్రాక్టర్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు100 కార్ల బహుమతిగా అందించేందుకు తెలంగాణ జాన్డీర్ డీలర్స్ అసోసియేషన్ నిర్ణయించింది.  దసరా ధమాకా లక్కీ డ్రా  పేరట ఈ స్కీంను ప్రారంభిస్తున్నట్లు వివిసీ మోటార్స్ ఎండీ వివి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు .


ఈ సందర్భంగా జాండీర్ డీలర్స్ మాట్లాడుతూ జాన్డీర్ కస్టమర్ల కోసం గత పది సంవత్సరాలుగా ఈ లక్కీ డ్రా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నామని
 ఈ సంవత్సరం లక్ష ట్రాక్టర్ల మైలురాయి ని మరియు  జాన్డీర్ తెలంగాణలో 21 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా
 ఈసారి 100 కార్లతో లక్కీ డ్రా స్కీమ్ తో మా కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో జాన్డీర్ ట్రాక్టర్ కొన్న ప్రతి కస్టమర్ కి ఈ లక్కీ డ్రా లో
 పాల్గొనే అవకాశం ఉంటుందని, కంపెనీ ఫోర్ వీల్ డ్రైవ్ ఇంకా మరిన్ని కొత్త టెక్నాలజీస్ ని ఈ దసరా పండగ లోపు విడుదల చేయబోతోంది. ఈ
 లక్కీ డ్రా ని నవంబర్ నెలలో నిర్వహించి కార్ల విజేతలను ఎంపిక చేయటం జరుగుతుందని అసోసియేషన్ ప్రతినిధులు మీడియాకి వివరించారు.ఈ కా
ర్యక్రమంలో వి.వి.సి మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ వి.వి రాజేంద్రప్రసాద్, డీలర్స్ పీ.ఎస్.శేకర్, కే.సుదర్శన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రాజేష్ యాదవ్, అన్సన్, నితేష్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *