తెలుగు రాష్ట్రాల ప్రజలకు తానా 700 కి పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిణీ

తెలుగు రాష్ట్రాల ప్రజలకు తానా 700 కి పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిణీ

కోవిద్ సమయంలో తానా సేవలు ప్రశంసనీయం

రవాణా మంత్రి అజయ్ కుమార్ పువ్వాడ

Hyderabad

కోవిడ్ సంక్షోభంలో  తానా చేస్తున్న సేవలు, సహాయక కార్యకలాపాలు స్ఫూర్తిదాయకమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ప్రస్తుత తానా ప్రెసిడెంట్ జయ శేఖర్ తల్లూరి తనకు వ్యక్తిగతంగా బాగా తెలుసు, ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి తానా లాంటి సేవా సంస్థకు నాయకత్వం వహించడం అభినందనీయమన్నారు. తానా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్‌లను పంపిణీ చేస్తోందని…అనేక  సదుపాయాలు కల్పిస్తుందన్నారు. . ఇప్పుడు ఆస్పత్రులు, నిరుపేద సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థలకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిణీ చేయడం ఎంతో  ప్రశంసనీయమని అన్నారు.
తాన అధ్యక్షుడు తల్లూరి జై  నాయకత్వంలో గత 4 వారాల్లో ఇప్పటివరకు 700 కి పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను తానా పంపిణీ చేసినట్లు తానా ఇండియా ట్రస్టీ  శ్రీనాథ్ కుర్రా వివరించారు. కోవిడ్ 2 వ వేవ్ లో తానా చాలా త్వరగా స్పందించిందని, ఆసుపత్రి వినియోగం మరియు గృహ వినియోగం కోసం ఆక్సిజన్ కాన్సాన్ట్రేటర్ల యొక్క తక్షణ అవసరాన్ని గుర్తించామని శ్రీనాథ్ వివరించారు.

సరుకులు స్వీకరించడం, అన్‌లోడ్ చేయడం మరియు లోడ్ చేయడం, కాన్సంట్రేటర్లను ఆసుపత్రులకు అందజేయడం, రెడ్ క్రాస్ వంటి సంస్థలకు పంపడం ద్వారా తానా ఇండియా బృందం కర్ఫ్యూ సమయంలో నిరంతరం పనిచేస్తుందని శ్రీనాథ్ అన్నారు.  ఐటీ మంత్రి  కెటి రామారావు డిల్లీ మరియు హైదరాబాద్ విమానాశ్రయాలలో సరుకులను క్లియర్ చేయడంలో అపారమైన మద్దతు ఇవ్వడంతో పాటు ఈ చర్యలో మార్గదర్శిగా నిలుస్తున్నారు.

ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సిజ్జనార్, కుర్రా మహేష్ డైరెక్టర్ అలెక్య హోమ్స్, నర్సిమారెడ్డి ఎండి టిఎస్ఐఐసి వంటి అధికారులు  అవసరమైన సహకారం అందించినట్లు శ్రీనాథ్ కుర్రా  తెలిపారు. చంద్ర రాజేశ్వర రావు ఫౌండేషన్, మానవ సేవా ఫౌండేషన్, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్, సైబరాబాదా కమిషనరేట్ మొదలైన వాటికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *