తెలంగాణ లో త్వరలో క్రీడా పాలసీని రూపొందిస్తున్నాం :మంత్రి శ్రీనివాస్ గౌడ్

త్వరలో క్రీడా పాలసీని రూపొందిస్తున్నాం :మంత్రి శ్రీనివాస్ గౌడ్

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్ క్రీడలో అద్భుతమైన విజయాలను సాధిస్తూ రాష్ట్రానికి, దేశానికి ఎంతో పేరు ప్రతిష్టలను తీసుకవస్తున్న నిక్కత్ జరీన్ ను క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను నిక్కత్ జరీన్ మర్యాద పూర్వకంగా కలిశారు. స్పోర్ట్స్ కోట కింద బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగం లభించడం అభినందనీయమన్నారు.
క్రీడల అభివృద్ధి కి నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా త్వరలోనే మంచి క్రీడా పాలసీని రూపొందిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.అనంతరం క్రీడాకారుడు నిక్కత్ జరీన్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూల బొకే ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి KS శ్రీనివాస రాజు, ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు బాద్మి శివకుమార్, జయప్రకాష్ విద్యాసంస్థల ఛైర్మన్ రవికుమార్, నిక్కత్ జరీన్ తండ్రి జమీల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *