తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఫలితాలను మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు నిర్వహించలేదు అయితే పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఉత్తీర్ణత సాధించిన వారిలో బాలికలు 2 లక్షల 28వేల 754 మంది కాగా ,2 లక్షల 22 వేల 831 బాలురు ఉన్నారు.
వీరిలో 1,76, 719 మంది ఏ గ్రేడ్ , 1,04, 886 మంది బీ గ్రేడ్..61,887 మంది సీ గ్రేడ్,1,08,093 మంది డీ గ్రేడ్ లో ఉత్తీర్ణత సాధించారు.ఈ ఏడాది
మొదటి సంవత్సరం మార్కులనే ద్వితీయ సంవత్సరం కు వర్తింపజేశారు. ప్రాక్టీకల్స్ మార్క్స్ మాత్రం అందరికి గరిష్టంగా వేశారు.గతంలో ఫెయిల్ అయిన వారికి 35 మార్కులతో పాస్ మార్కులు వేశారు. మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్ ద్వారా సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేసింది ఇంటర్ బోర్డ్ .
ప్రస్తుతం ప్రకటించిన ఫలితాలు విద్యార్థులకు నచ్చకపోతే కరోనా తగ్గకా మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యా శాఖ తెలిపింది. విద్యార్థుల పాస్ మెమో లో ఏదైనా తప్పులు దొర్లితే ఉదయం 9.30 నుండి సాయంత్రం5.30 వరకు
040-24600110 కి పిర్యాదు చేయవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.