తెలంగాణలో తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తా :టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

తెలంగాణ లో కాంగ్రెస్ ని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.బడుగు..బలహీన వర్గాల కోసం పోరాడతానని అన్నారు.
అమర వీరుల ఆశయాల కోసం పని చేస్తానని తెలిపారు.రాహుల్..సోనియా గాంధి ఆలోచన మేరకు పని చేస్తానని..కాంగ్రెస్ అంటే కార్యకర్తల పార్టీ అని నిరుపిస్తామన్నారు.నిన్న..మొన్న వరకు అభిప్రాయ బేధాలు ఉన్న వారిని కూడా మాట్లాడతానని రేవంత్ అన్నారు.

సీనియర్ల అందరి అభిప్రాయాలు తీసుకుని పని చేస్తానని…పార్టీ లో భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.అందరం కలిసి కొట్లడుతామని …అందరినీ కలుపుకుని మంచి యాక్షన్ ప్లాన్ తో ముందుకు పోతామన్నారు. నిన్నా మొన్నటి వరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిని కూడా కలుపుకుని పోతానని రేవంత్ రెడ్డి అన్నారు
కోమటిరెడ్డి మా కుటుంబం సభ్యుడని.. ఉత్తమ్.. భట్టి… జానారెడ్డి లాంటి వాళ్లు తో మాట్లాడి కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *