తెలంగాణలో క్రీడల అభివృద్ధి కి సీఎం కేసీఆర్ క్రీడా పాలసీని తీసుకువస్తున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కు పెద్దపీట వేశామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. క్రీడల అభివృద్ధి లో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో మినీ స్టేడియం ల నిర్మాణం చేస్తున్నామన్నారు. ఇప్పటికే 50 శాతం స్టేడియాల నిర్మాణం పూర్తి చేశామన్నారు. మిగితా స్టేడియాల నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. త్వరలోనే పూర్తి చేస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు . రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి సీఎం కేసీఆర్ క్రీడా పాలసీ ని తయారు చేయటానికి క్యాబినెట్ సబ్ కమిటీ ని నియమించారన్నారు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందిస్తున్నామన్నారు. గతంలో క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో, ఒలంపిక్స్ లో రాణించిన క్రీడాకారులకు గత ప్రభుత్వాలు నామ మాత్రంగా సహాయ సహకారాలు అందించాయన్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ను అందించేందుకు గోల్డ్ మెడల్ కు 2 కోట్ల రూపాయలు, రజతం కు కోటి రూపాయలు, కాంస్య పతకం కు 50 లక్షల రూపాయల ను నగదు పురస్కారాలను అందించి క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నామన్నారు. క్రీడాకారులు లకు ఉద్యోగ, ఉన్నత విద్యా కోసం రిజర్వేషన్లు ను అమలు చేస్తున్నామన్నారు. క్రీడాకారులను తీర్చిదిద్దే కోచ్ లకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. మంత్రి KT రామారావు గారి సూచనల మేరకు కార్పొరేట్ కంపెనీల CSR ఫండ్స్ ద్వారా క్రీడల అభివృద్ధి కి కృషి చేస్తున్నామన్నారు.

టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొంటున్న తెలంగాణ క్రీడాకారులు సానియా మీర్జా, సాయి ప్రణీత్ లు సత్తాచాటి తెలంగాణ రాష్ట్రం కీర్తి ప్రతిష్టలను పెంచాలని కోరారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి , క్రీడా సంఘాలకు క్రీడా శాఖ ద్వారా ఎంతో ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు. ఒలంపిక్స్ అసోసియేషన్ ద్వారా క్రీడల అభివృద్ధి కి చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. కరోనా మహమ్మారి వల్ల క్రీడాకారులు తమ ఫిట్ నెస్ ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల కరోనా మహమ్మారి తో చనిపోయిన క్రీడా దిగ్గజం మిల్కాసింగ్ తో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు క్రీడాకారులు, క్రీడా అసోసియేషన్ సభ్యులు, స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ సలీం లకు సంతాపం ప్రకటించారు. 2 నిమిషాల మౌనం పాటించి వారి సేవలను స్మరించుకున్నారు.

ఒలంపిక్స్ డే సెలెబ్రేషన్స్ – 2021 సందర్భంగా తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ZOOM యాప్ ద్వారా నిర్వహించిన వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్నారు. క్రీడాకారులు ఒలింపిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ ZOOM మీటింగ్ లో తెలంగాణ ఒలంపిక్స్ అసోసియేషన్ సీనియర్ అసోసియేషన్ సభ్యులు సముద్రాల వేణుగోపాల చారి, SATS చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ప్రధాన కార్యదర్శి జగదీష్ యాదవ్, ప్రేమ్ రాజ్, హ్యాండ్ బాల్ జాతీయ ఫెడరేషన్ అధ్యక్షులు జగన్ మోహన్ రావు, బాస్కెట్బాల్ అసోసియేషన్ శ్రీధర్ రెడ్డి, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఇస్మాయిల్ బేగ్ , వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, SATS అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *