తీవ్రమైన కామెర్లతో బాధపడుతూ కోమాలోకి వెళ్ళిన ఓ తల్లికి పునఃజన్మ ప్రసాదించిన పేస్ హాస్పిటల్ వైద్యులు
వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన ఓ మహిళ కామెర్ల వ్యాధితో బాధపడుతూ కోమా స్థితిలో పేస్ ఆసుపత్రికి వచ్చారని డాక్టర్ ఫణి కుమార్ తెలిపారు . ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని..ఆసుపత్రికి రాకముందు పది రోజుల పాటు నాటు మందులు సైతం వాడారని తెలిపారు. ఈమె శరీరంలో కామెర్ల ముదిరిపోయిందని .. ఏకంగా 30 శాతం ఎంజీకి చేరుకుందన్నారు .కామెర్ల కారణంగా ఆమె కోమాలోకి చేరడంతో పాటు మూర్చ వ్యాధి సోకిందని డాక్టర్ ఫణి కృష్ణ వివరించారు. ఇలాంటి పరిస్థితిలో ఆమెకు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స అవసరమని గుర్తించామన్నారు. వెంటనే జీవన్ ధాన్ సంప్రదించి ఆమె బంధువుల కాలేయం అమర్చి చికిత్స అందించినట్లు ఆయన వెల్లడించారు.
ఇది అత్యంత క్లిష్టమైన సవాల్ తో కూడిన స్థితి అని..తీవ్ర కాలేయ వైఫల్యంతో పాటు ఇన్ ఫెక్షన్ మూర్చ సమస్య ఉందన్నారు. కాలేయమార్పిడి తర్వాత కూడా 50 శాతం మృత్యువాత పడే అవకాశాలు ఉన్నాయని.. చీఫ్ హెపటాలజిస్ట్ డాక్టర్ గోవింద్ వర్మ తెలిపారు.
మహిళకు కామెర్ల, మెదడువాపు నియంత్రించడంతో ఆపటు ఇన్ ఫెక్షన్ సైతం నియంత్రించిన తర్వాత ఆమెకు అత్యవసరంగా కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను పది మంది డాక్టర్ల బృందం చేసింది. రోగి సోదరుడు ఆమెకు తన కాలేయం దానం చేశాడని..అతని కాలేయంలోని కుడివైపు భాగాన్ని ఆమెకు మార్పిడి చేశామని డాక్టర్ మధుసుదన్, డాక్టర్ ఫణికృష్ణ, డాక్టర్ మంజునాథ్ లు తెలిపారు .అత్యంత సవాల్ తో కూడిన శస్త్ర చికిత్స ను సజావుగా చేశామన్నారు. శస్త్ర చికిత్స జరిగిన 12 గంటల్లోనే ఆమె కోమానుంచి బయటపడిందని ..కామెర్ల ఏడురోజుల్లో తగ్గిపోయాయని తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత పది రోజుల్లోనే ఆమెను డిస్ ఛార్జ్ చేసేందుకు తగిన ఫిట్ నెస్ సాధించగలిగిందని వైద్యులు తెలిపారు.
కాలేయమార్పిడి శస్త్ర చికిత్స సమయంలో ఆమెకు ఉన్న ఆరోగ్య స్థితినిబట్టి సజావుగా సాగినప్పటికీ రోగి అంత తొందరగా కోలుకోవడం సాధ్యం కాదని భావించాము . కాని అద్బుతంగా అత్యంత వేగంగా కోలుకున్నారని..శస్త్ర చికిత్స తర్వాత ఆరుగంటల్లో కోలుకోవడం ఆనందం కల్గించిందని ట్రాన్స్ ఫ్లాంట్ సర్జన్ డాక్టర్ మధుసూదన్ తెలిపారు.
పేస్ హాస్పిటల్ లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభించిన తర్వాత ఆరు నెలల కాలంలో 12కుపైగా కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు చేసినప్పటికీ ఈ కేసు మాత్రం క్రిటికల్ గా ఉన్న సక్సెస్ చేయగలిగామని డాక్టర్ గోవింద్ వర్మ అన్నారు.ఐసీయూ,హెపటాలజీ, ట్రాన్స్ ఫ్లాంట్ టీం కలిసి శస్త్ర చికిత్స చేయడం వల్లే పేషంట్ కోలుకున్నారని తెలిపారు. కాలేయమార్పిడికి అత్యత్తుమ కేంద్రంగా పేస్ ఆసుపత్రి నిలుస్తుందన్నారు .