తాజ్‌కృష్ణలో ట్రెండ్జ్ ఫ్యాషన్ డిజైనరీ ఎగ్జిబిషన్ ప్రారంభం
మగువల మదిని దోచే అభరణాలు…..అమ్మాయిలను ఆకట్టుకునే డిజైనరీ వస్త్రాలు….అతివలను అలరించే చీరల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంటుంది.
హైదరాబాద్ తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన ట్రెండ్జ్స్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ను సామాజిక వేత్త అన్నపూర్ణ మోడల్స్ తో కలిసి ఆమె ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ డిజైనర్లు తయారుచేసిన వస్త్ర ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి.
ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన వివిధ రకాలైన స్టాల్స్‌ను మోడల్స్‌తో కలిసి సందర్శిస్తూ….
అభరణాలను ధరిస్తూ…సరికొత్త ఉత్పత్తులను ప్రదర్శిస్తూ సందడి చేశారు. అన్నీ రకాలైన ఉత్పత్తులు ఒకే వేదికపై ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని సామాజికవేత్త అన్నపూర్ణ అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 75 మంది ప్రముఖ డిజైనర్లు తమ సరికొత్త కలెక్షన్‌ను ప్రదర్శనలో ఏర్పాటు చేశారని ట్రెండ్జ్స్ ఎగ్జిబిషన్ నిర్వహకురాలు శాంతి తెలిపారు. భాగ్యనగర
ఫ్యాషన్ ప్రియులు మెచ్చే వస్త్రాభరణాలతో ఏర్పాటైన ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగుతుందని
వివరించారు.