టీ సేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ వ్యాప్తంగా టీ సేవ ఆన్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందేందుకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీ సేవ సెంటర్ డైరెక్టర్ వెంకటరెడ్డి అడపా తెలిపారు. టీ సేవ ఆన్ లైన్ ద్వారా వివిధ బిల్లుల చెల్లింపులు బస్సు ,రైలు , విమానాలు టికెట్స్ బుకింగ్ , కొత్త పాన్ కార్డు అప్లై కరెక్షన్ లను చేసుకునే అవకాశం ఉందన్నారు.
దీంతో పాటు వివిధ టెలికాం పోస్ట్ పెయిడ్ , ప్రీపెయిడ్ రీఛార్జ్ లు , అన్ని బ్యాంకుల మనీ ట్రాన్స్ ఫర్ లు , ఆధార్ పేమెంట్లు , మైక్రో ఎటిఎం సేవలు ల్యాండ్ లైన్ బిల్ పేమెంట్ , డిటిహెచ్ , అకౌంట్ ఓపెనింగ్ , క్యాష్ డిపాజిట్ , లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీసులు వినియోగదారులకు అందించడం ఉపాధి పొందవచ్చని వెంకట్ రెడ్డి తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ ,ఓబిసి, ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులు, వికలాంగులు, పదవీ విరమణ చేసిన సైనికులు, మహిళలకు 25 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గింపు అవకాశం కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు www.tsevacenter.com లో జులై 15 వ తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 8179955744 ను సంప్రదించగలరు.