జూలై 1 నుంచి ఏడో విడత హరితహారం
జూన్ 1 నుంచి ప్రతిష్టాత్మకంగా ఏడవ విడత తెలంగాణకు హరితహారం
ఏడవ విడత లో 20 కోట్లమొక్కలు నాటే లక్ష్యాన్ని తెలంగాణకు హరితహారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేషించింది. 2015 లో ప్రారంభమై 230 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా నిర్దేశించింది. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 15 ,241 నర్సరీల అందుబాటులో ఉన్నాయి. వీటిలో సుమారు 25 కోట్ల మొక్కల ఉన్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు పంచాయితీ రోడ్ల వెంట బహుళ వనాలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. యాదాద్రి (మియావాకీ) మోడల్ లో చెట్లు నాటేందుకు ప్రాధాన్యత కల్పించింది. ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ, పెంచే బాధ్యత ఆయా కుటుంబాలకు అప్పగించింది.
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటాలనే ప్రభుత్వం నిర్ణయించింది.
జులై 1 నుంచి 10 దాకా పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై రాష్ట్ర మంతటా స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది.
ప్రతీ ప్రాంతంలో అటవీ భూముల గుర్తించి, అటవీ పునరుద్దరణకు చర్యలు చేపట్టింది.అటవీ బ్లాకుల వారీగా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అటవీ పునరుద్దరణ ప్రణాళికలు రచించింది. ఇప్పటికే గ్రీన్ బడ్జెట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి విద్యా సంస్థ, ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల ఖాళీ స్థలాల్లో ఖచ్చితంగా పచ్చదనం పెంపుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
ప్రతీ మండల కేంద్రంతో పాటు, పట్టణ ప్రాంతాలకు సమీపంలో పెద్ద ప్రకృతి వనాల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత కల్పించింది.ఖచ్చితంగా 85 శాతం మొక్కలు బతికేలా పంచాయతీ రాజ్ చట్టం అమలుకు నిర్ణయం తీసుకుంది.అన్ని స్థాయిల్లో ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజల భాగస్వామ్యం ఉండేలా చర్యలు చేపట్టింది. గత ఆరు విడతల్లో 220.70 కోట్లు మొక్కలు నాటామని ప్రభుత్వం వెల్లడించింది.అడవుల బయట 159.88 కోట్ల మొక్కలు. అడవుల లోపల 60.81 కోట్ల మొక్కలు నాటింది. హరితహారం కోసం ఇప్పటిదాకా అన్ని శాఖలు కలిపి 5,591 కోట్లు ఖర్చు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక (2019) ప్రకారం రాష్ట్రంలో 3.67 శాతం పచ్చదనం పెరుగుదల జరిగినట్లు వెల్లడైంది. హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 109 అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్దికి చర్యలు చేపట్టింది. ఇప్పటికే పూర్తయిన 53 పార్కులలో 35 ప్రజలకు అందుబాటులోకి రాగా18 రెడీగా ఉన్నాయి.
మిగతా 56 అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఏడాది లోగా పూర్తి కానున్నాయి. లక్ష్యం. ప్రభుత్వం గుర్తింపు పొందిన లే అవుట్లలోనూ పచ్చదనం పెంపుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.