జూన్ 13 న బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం
ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవానికి దేశవ్యాప్తంగా
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారని అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.ముఖేఅంబానీ భార్య నీతు అంబనీ ఎల్లమ్మ తల్లి భక్తురాలు అని అన్నారు.
జులై 13 న ఎల్లమ్మ తల్లి కళ్యాణం , 14 న రథోత్సవం నిర్వహిస్తున్నట్లు తలసాని తెలిపారు.ఈ ఏడాది అమ్మవారిని దర్శనం చేసుకోలేని భక్తుల కోసం కళ్యాణ మహోత్సవం ,రథోత్సవం లైవ్ టెలికాస్ట్ చేయనున్నామన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తలసాని తెలిపారు.బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణం కు 70 నుంచి 80 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని.. భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయానికి రావాలన్నారు.
అన్ని శాఖల సమన్వయంతో,ప్రజాప్రతినిధుల సహకారంతో రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళుతున్నామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దైవ భక్తుడని..ఈ కల్యాణం ఘనంగా జరపాలని స్పెషల్ బడ్జెట్ కూడా కేటాయించారన్నారు. కోవిడ్ మహమ్మరి నుండి రాష్ట్ర ప్రజలను అమ్మవారు కాపాడాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం..