జీహెచ్ఎంసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులందరికీ ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని స్వయం సహాయక బృందాల మహిళల కుటుంబ సభ్యులందరితో పాటు జిహెచ్ఎంసి ఉద్యోగులు, సిబ్బంది, కార్మికుల కుటుంబ సభ్యులందరికీ కోవిడ్ వాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలో 18 ఏళ్ల పైబడినవారందరికి  ఉచితంగా వాక్సిన్ ఇవ్వడానికి ఇప్పటికే 100 వాక్సిన్ కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. నగరంలోని అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సిన్ ను అందజేస్తున్నారు. కాగా స్వయం సహాయక మహిళలు, జిహెచ్ఎంసి ఉద్యోగుల కటుంబ సభ్యులందరికీ కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు జిహెచ్ఎంసి స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది.గ్రేటర్ లోని అన్ని సర్కిళ్లలో స్వయం సహాయక మహిళా బృందాలకు సమావేశాలు ఏర్పాటు చేసి తమ కుటుంబ సభ్యులందరికీ వ్యాక్సిన్ ను ఇప్పించేందుకు సమీపంలోని వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్ళాలని సూచించారు. నగరంలో ఏర్పాటు చేసిన వంద కేంద్రాల్లో స్వయం సహాయక మహిళా బృందాలు, జిహెచ్ఎంసి ఉద్యోగుల కుటుంబ సభ్యులతో పాటు అన్ని వర్గాల వారికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది.  అయితే 18 ఏళ్లకు పైబడిన  ప్రతీ ఒక్కరూ తాము ముందుగా కోవిన్ పోర్టల్ https://selfregistration.cowin.gov.in/ లో తమ వివరాలను నమోదు చేయించుకోవాలి. ఈ  పోర్టల్ లో తమ వివరాలను నమోదు చేసుకున్న అనంతరం మొబైల్ ఫోన్లకు వచ్చే OTP తో సమీపంలోని వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లాలని జిహెచ్ఎంసి తెలియజేసింది. ప్రతి కేంద్రంలో రోజుకు కనీసం వెయ్యి మందికి వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాటు చేశారు. కాగా కోవిడ్ వ్యాక్సిన్ ను తమ సమీపంలోని కేంద్రాల్లో ఉచితంగా తీసుకోవాలని కోరుతూ గ్రేటర్ హైదరాబాద్ లోని 12.91 లక్షల మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులకు ఎస్.ఎం.ఎస్ ద్వారా జిహెచ్ఎంసి సమాచారం అందించింది.

18 ఏళ్లకు పైబడిన ప్రతి ఒక్కరికి ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది..
వ్యాక్సిన్ కై కోవిన్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని, ఫోన్ కు వచ్చే OTP మెసేజ్ తో వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లాలి. కోవిడ్ వ్యాక్సిన్ వివరాలకై నెం.  040-21111111 కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *