జాతీయవాదంతో ముందుకు వెళ్తున్న పార్టీ బీజేపీ : బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మాదినాగూడ కిన్నెర గ్రాండ్ లో బీజేపీ జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జి మురళీధర్ రావు సమక్షంలో పార్టీ ఎదుగుదల కోసం జాతీయవాదుల ఆత్మీయుల సమావేశ కార్యక్రమం నిర్వహించారు.భారత రాజకీయాలు , రాష్ట్రంలోని పలు సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో పలు సంఘాల నాయకులు, పలు రంగాల వ్యాపార వేత్తలు,పలు ప్రాంతాల నుంచి వచ్చి స్థిర నివాసం ఉంటున్నా ప్రముఖులు జాతీయవాదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ ఈ దేశంలో జాతీయవాదంతో కుల,మత, ప్రాంతీయ బేధాలు లేకుండా పని చేస్తున్న పార్టీ ఒక్క బీజేపీ పార్టీ మాత్రమే అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురువుగా చేసే ప్రయత్నంలో ఈ రాష్ట్రం నుండి తోడుగా నిలిచి జాతీయవాదులుగా నిలుదాం అని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్,యోగనంద్ , రాజు ,శ్రీనాథ్ రెడ్డి గారు,జాతీయవాదులు,ప్రముఖులు,వ్యాపార వేత్తలు, సీనియర్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *