జంతువుల పెంపకం అమ్మకందారులు తెలంగాణ స్టేట్​ ఎనిమిల్​ వెల్ఫేర్​ బోర్డు రిజిస్ట్రేషన్​చేయించాలి : సీఎస్ సోమేష్ కుమార్

హైదరాబాద్​ :

గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​  పెంపుడు జంతువులపై కూరత్వాన్ని అరిట్టాలని, డాగ్​ బ్రీడర్స్​(కుక్కల పెంపకందారులు,  అమ్మకందారుల) అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్​ కుమార్​ అధికారులను ఆదేశించారు.కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం‌‌–2017 నిబంధనలకు లోబడి డాగ్​ బ్రీడర్స్​  కార్యకలాపాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు..  బ్రీడింగ్​ ఆక్టివిటీలో ఉన్న వారందరూ చట్టానికి లోబడి వ్యవరించే విధంగా  తెలంగాణ స్టేట్​ ఎనిమిల్​ వెల్ఫేర్​ బోర్డు  రిజిస్ట్రేషన్​ కలిగి ఉండేలా డాగ్​ బ్రీడర్స్​ కు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు మున్సిపల్​ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్​ కుమార్​ , జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేష్​ కుమార్​, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్​ రంజన్​ లకు లేఖలు రాశారు. డాగ్​ బ్రీడింగ్​ ఆక్టివిటీ  చేసే వారందరు స్టేట్​ ఎనిమల్​ వెల్ఫేర్​ బోర్డు రిజిస్ట్రేషన్​ చేసుకునే విధంగా  వచ్చే నాలుగు వారాల పాటు గడువు కల్పించి రిజిస్ట్రేషన్​ కు వారికి సహకరించాలని సూచించారు. 

  ఫేస్​ బుక్​, ట్విట్టర్​, ఇన్ స్టాగ్రామ వంటి సోషల్ మీడియా నెటవర్కింగ్​ ద్వారా అధికారిక, అనధికారిక ప్రకటనలతో కుక్క పిల్లల క్రయవిక్రయాలు జరపడం అక్రమమని అర్వింద్​ కుమార స్పష్టం చేశారు.  అన్​ లైన్​ ద్వారా కుక్క పిల్లల క్రయ విక్రయాలకు తెలంగాణ స్టేట ఎనిమల్​ వెల్ఫేర్​ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అన్నారు.  ఆన్ లైన్ లో జరిగే  ఇలాంటి లావాదేవీలు, వ్యాపారాలపై ఐటీ శాఖ నిఘా వేసి  కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్​ కు సూచించారు.

నిబందనలు పాటించని వారి కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేశారు.  ఇందు కోసం డైరెక్టర్​,  పశుసంవర్ధక శాఖ, డైరెక్టర్​, మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన(సిడిఎంఏ),  హైదరాబాద్​, సైబరాబాద్​, రాచకొండ పోలీసు కమిషనర్ల సహకారంతో  రిజిస్ట్రేషన్​ లేని డాగ్​ బ్రీడర్సపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.  ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను ఆగస్టు 15వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదించాలని లేఖలో కోరారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *